నిఖిల్ సిద్ధార్థ్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా జిఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 18 పేజీస్. నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈ మూవీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ చిత్రంలో ఆమె నటించిన నందిని క్యారెక్టర్ చాలా టిపికల్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు. ” ఈ క్యారెక్టర్ మోస్ట్ ఫేవరెట్ క్యారెక్టర్. దీని గురించి ఎక్కువగా చెప్పలేను. సినిమా చూస్తే మీకే తెలుస్తుంది. సుకుమార్ రంగస్థలం ఛాన్స్ మిస్ అయినప్పుడు చాలా బాధపడ్డాను.
Read More: Kantara2: షూటింగ్ కి రెడీ అవుతున్న మరో పాన్ ఇండియా సినిమా..!
కానీ ఇప్పుడు సుకుమార్ రాసిన నందిని పాత్రలో నటించడం సంతోషంగా ఉంది. నాకు అనుపమలాంటి కూతురు ఉంటే బాగుండేది అని అల్లు అరవింద్ గారు అనడం పెద్ద ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఆయన నన్ను కూతురిలా బాగా చూసుకుంటారు. ఇక దర్శకత్వం ఎప్పుడు అని అందరూ అడుగుతున్నారు.
తప్పకుండా దర్శకత్వం చేస్తా. ప్రస్తుతం ఉన్న సినిమాల కమిట్మెంట్స్ అయిపోవాలి. ఆ తర్వాత నటనకు కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని, దర్శకుల వద్ద సాంకేతిక అంశాలపై అవగాహన పెంచుకొని, ఆ తరువాత డైరెక్షన్ చేస్తాను. వీలు కుదిరినప్పుడల్లా కథ రాసుకుంటున్నాను. అయితే నేను దర్శకత్వం వహించే సినిమాలో మాత్రం నటించను” అని చెప్పుకొచ్చింది అనుపమ.
Read More: Pre Release Event : గెస్ట్ ఎవరు ?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...