Amala Paul : వారణాసి మహిళ పాత్రలో అమలాపాల్

మాలీవుడ్ ముద్దుగుమ్మ అమలపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేమఖైదీ సినిమా ద్వారా తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అమలాపాల్…. అదే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో కూడా పాపులర్ అయింది. అలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో లవ్ లో పడింది. అలా చాలా రోజుల పాటు రహస్యంగా లవ్ ట్రాక్ నడిపిన వీరిద్దరూ ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని అప్పట్లో హాట్ టాపిక్ గా మారారు.

విజయ్ ని పెళ్లాడిన తర్వాత సినిమాలలో నటించని అమలాపాల్.. విడాకులు తీసుకున్న తర్వాత వరుస ప్రాజెక్టులు చేస్తూ బిజీగా తన జీవితాన్ని గడుపుతుంది. ఇక అమలాపాల్ ప్రస్తుతం బాలీవుడ్ అరంగేట్రం చేస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న “భోళా’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో నటి టబు కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం కార్తీ నటించిన ఖైదీ సినిమాకు హిందీ రీమేక్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వారణాసిలో జరుగుతోంది. అయితే ఈ చిత్రంలో అమలాపాల్ ఓ వారణాసి మహిళ పాత్రలో కనిపించనుందట. మరో వారం రోజులపాటు వారణాసి లోనే షూటింగ్ చేయబోతుంది మూవీ యూనిట్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు