తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నుంచి వస్తున్న తాజా చిత్రం తునీవు. హెచ్ వినోత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. తునీవు సంక్రాంతి బరిలో ఉండబోతుంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో కోలీవుడ్ లో సంక్రాంతి పోటీ రసవత్తరం అయింది. తమిళంలో విజయ్ తలపతి నటిస్తున్న వారీసు కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్న సంగతి విధితమే.
అయితే ఈ ఇద్దరు తమిళ స్టార్ హీరోలు తెలుగు మార్కెట్ పై ఫోకస్ చేశారు. రెండు సినిమాలను తెలుగులోనూ సంక్రాంతి బరిలో ఉంచుతున్నారు. విజయ్ తలపతి తన వారీసు సినిమాను వారసుడు అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. దీనికి నిర్మాత దిల్ రాజు కావడంతో బిజినెస్ కూడా బాగానే జరుగుతుంది.
దీనికి అజత్ కుమార్ తునీవు కూడా టాలీవుడ్ లో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. తన తునీవు చిత్రాన్ని తెలుగులో సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పిన చిత్ర యూనిట్ తాజాగా తెలుగు టైటిల్ ను కూడా విడుదల చేశారు.
తునీవు తెలుగు టైటిల్ తెగింపు అని ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. అంతే కాకుండా దానికి సంబంధించిన ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మూవీని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్, ఐవివై ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా రిలీజ్ చేయనున్నాయి.
తెలుగు లో విజయ్ తలపతి తో పాటు అజిత్ కు కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో తెగింపు సినిమాకు తెలుగులో కూడా మంచి కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు.