Aditi Rao : అవ‌మానాలు ఎదుర్కున్నా

హీరోయిన్ అదితీరావు హైదరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ” సమ్మోహనం” సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది అదితి. ఒక్క సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకుంటేనే ఫ్యూచర్ గల్లంతవుతున్న ఈ రోజుల్లో అదితీరావు హైదరీ మాత్రం ఇందుకు కాస్త డిఫరెంట్. ఆ తరువాత వి , అంతరిక్షం, మహాసముద్రం వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది.

అదేవిధంగా తెలుగు, తమిళ్, హిందీ తదితర భాషల్లో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల హీరో సిద్ధార్ధ్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాదు వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని.. పెళ్లి చేసుకునే సన్నాహాలు కూడా చేస్తున్నారంటూ ఓ క్రేజీ గాసిప్ ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది.ఇదిలా ఉంటే.. అయితే తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితీరావు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.

తాను సినిమాల్లోకి రావడానికి ముందు చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది అదితీరావు. ” నేను సినిమాలలోకి రావడానికి ముందు చాలా అవమానాలను ఎదుర్కొన్నా. భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించాక దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చాను. వీటిని చూసి తమిళ దర్శకురాలు శారద నాకు హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. అయితే సినిమా విడుదల చాలా ఆలస్యమైంది. ఈ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. మా అమ్మ ముందు ఏడిస్తే బాధపడుతుందని బాత్రూం లోకి వెళ్లి ఏడ్చేదాన్ని. నేను చేసిన మొదటి మూవీ కావడంతో చాలా బాధపడ్డాను” అని తెలిపింది అదితీరావు హైదరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు