Adipurush: యాక్షన్ అదుర్స్ – ఎమోషన్ సంగతేంటి..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో సహా దేశవ్యాప్తంగా సినీప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. రామ, రావణుల మధ్య యాక్షన్ ఎపిసోడ్ ప్రధానంగా కట్ చేసిన ట్రైలర్ కళ్ళు చెమర్చే విజువల్స్ తో, గూస్ బంప్స్ తెప్పించే బీజీఎమ్ తో సినిమాపై అంచనాలను పెంచుతోంది. టీజర్ విడుదల సమయంలో వచ్చిన విమర్శలన్నిటికీ దర్శకుడు ఓం రౌత్ ఫస్ట్ ట్రైలర్ తోనే సమాధానం ఇచ్చినప్పటికీ తాజాగా విడుదలైన ట్రైలర్ తో ,మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్ అంత డార్క్ షేడ్ లో ఉండటం చూస్తే వీఎఫెక్స్ విషయంలో ప్రశాంత్ నీల్ ఫార్ములాని ఫాలో అయినట్టు అనిపిస్తోంది. ఇక సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది రెండు షాట్స్ లోనే అయినప్పటికీ తన స్క్రీన్  ప్రెజెన్స్ తో ఆకట్టుకుంటోంది.
క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ అదుర్స్ అనిపించేలా ఉన్నప్పటికీ, సీతా రాముల మధ్య ప్రేమని పొయెటిక్ గా చూపించే షాట్ ఒక్కటి కూడా ట్రైలర్ లో లేకపోవటం ఒకింత నిరుత్సాహపరిచే విధంగా ఉంది. ఇంతకీ, ఆదిపురుష్ సినిమాలో సీతను అరణ్యవాసానికి పంపే ఎపిసోడ్ లాంటి ఎమోషనల్ కంటెంట్ ఉంటుందా లేక రామ, రావణుల మధ్య యుద్ధంతోనే ముగిస్తారా అన్న అనుమానం కలుగుతోంది. రావణుడి క్యారెక్టర్లో నటించిన సైఫ్ అలీ ఖాన్ గెటప్ పై కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మొత్తానికి ఫైనల్ ట్రైలర్ తో అంచనాలను అమాంతం పెంచేసింది ఆదిపురుష్ సినిమా యూనిట్. ఇప్పటిదాకా వచ్చిన ఆదిపురుష్ అప్డేట్స్ లో ఫైనల్ ట్రైలర్ కి ఎక్కువ మార్కులు పడ్డాయని చెప్పచ్చు. ఇప్పటికే పీక్స్ లో ఉన్న ఆదిపురుష్ బజ్, ఈ ట్రైలర్ తో మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రభాస్ గత నటించిన గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయిన క్రమంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా అంచనాలను అందుకొని ఇండియన్ సినిమా స్టామినాని మరోసారి ఖండాంతరాలకు వ్యాపింపచేస్తుందా లేదా చూడాలి.
https://youtu.be/qkD5juVLDgM

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు