Aafat Song : బకరా అయిపోయాడు

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ ఉన్న హీరో. అయితే, విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా చేసిన ఈ సినిమా ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకున్నాయి. ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన అక్డి పక్డి, వాట్ లగా దేంగే లాంటి సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ బాగా వచ్చింది. మరో పాటను విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయిపోయారు. అదే ఆఫత్. ఈ పాటకు సంబంధించిన ప్రోమోను కూడా గురువారం విడుదల చేశారు. తాజాగా పూర్తి సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆఫత్ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ లో రమ్యకృష్ణ హైలైట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆఫత్ సాంగ్ లోనూ రమ్యకృష్ణ చెప్పే మాటలే హైలెట్ గా నిలిస్తున్నాయి.

బకరా అని ఫిక్స్ అయ్యాకే అమ్మాయిలు నంబర్ ఇస్తారని, విజయ్ ని దృష్టిలో పెట్టుకొని రమ్యకృష్ణ చెప్పే డైలాగ్ తో ఈ సాంగ్ ప్రారంభమవుతుంది. ఇక ఈ సాంగ్ లో అనన్య, విజయ్ దేవరకొండ చాలా అందంగా కనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ అదిరిపోయాయి. అలాగే లిరిక్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సాంగ్ లో అందాలను ఆరబోసింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆఫత్ పూర్తిగా రొమాంటిక్ గా సాగింది. కాగా, ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదల కానుంది.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు