18 Pages: “నీ వల్ల ఓ పిల్ల” సాంగ్ విడుదల

వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న “జీఏ 2” పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “18 పేజిస్” నిఖిల్ సిద్దార్థ , అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు.మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు.

ఇటీవలే కార్తికేయ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న హీరో నిఖిల్ సిద్దార్థ్ & అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ “18పేజిస్” ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు “కుమారి 21ఎఫ్” చిత్ర దర్శకుడు సూర్యప్రతాప్ పల్నాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలే ఈ “18పేజిస్” టీజర్ కి, “నన్నయ్య రాసిన” అలానే “టైం ఇవ్వు పిల్ల” అనే పాటలతో పాటు రీసెంట్ గా రిలీజైన “ఏడు రంగుల వాన” అనే పాటకు కూడా అనూహ్య స్పందన లభించింది. ఈ చిత్ర ప్రొమోషనల్ కంటెంట్ సినిమాపై రోజురోజుకు ఆసక్తిని పెంచుతుంది. తాజాగా ఈ చిత్రంలోని నాలుగవ పాటను విడుదల చేసింది చిత్ర బృందం.

- Advertisement -

“నీ వల్ల ఓ పిల్ల” అనే ఈ పాటతో తిరుపతి మట్ల అనే కొత్త పాటల రచయితను ఇండస్ట్రీకి పరిచయం చేసింది జీఏ పిక్చర్స్.
“నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిలా గుండెల్లా
నిన్ను చదివిన నుంచి
నన్ను నేను మరిచినా
అన్ని ఇడిచి పెట్టినా
నిన్నే ఒడిసిపట్టినా” అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటను తిరుపతి రాయడమే కాకుండా దీనిని ఆయన ఆలపించారు. ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది.

“18 పేజెస్” చిత్రంలోని ఇప్పటికే రిలీజైన పాటలన్నిటికి మంచి స్పందన లభిస్తుంది. ఈ సినిమాకి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ 23 న క్రిస్టమస్ కానుకగా ఈ సినిమాను విడుదలచేయనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు