Lifestyle : నిజమైన హ్యాపీనెస్ ఎలా దక్కుతుందో తెలుసా?

సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి మధ్య చాలా తేడా ఉంటుంది. ఏం చేస్తే కంఫర్ట్ గా ఉంటామో మనకు బాగా తెలుసు. కానీ సంతోషం అనేదే అంతుచిక్కని విషయం. సంతోషం కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటారు. కానీ కంఫర్ట్ జోన్ ను దాటినప్పుడే ఆనందం, సంతోషం అనేవి మీ సొంతమవుతాయి. అంటే సంతోషం అనేది మీ కంఫర్ట్ జోన్ వెనకాల దాక్కుంటుంది. మీరు దాన్ని దాటినప్పుడే సంతోషం మీ దరిచేరుతుంది. మరి కంఫర్ట్ జోన్ ను దాటితేనే హ్యాపీనెస్ ఎలా దక్కుతుంది? అంటే…

1. కొత్త పరిచయాలు
సాధారణంగా ప్రతి ఒక్కరు ఈ గజిబిజి జీవితంలో పడి కొత్త వ్యక్తులతో పరిచయాలను పెద్దగా పెంచుకోరు. ముఖ్యంగా ఒకే రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు. అదే ఉద్యోగం, ఆఫీసులో తెలిసిన ముఖాలు, మళ్లీ ఇంటికి రావడంతో రోజంతా గడిచిపోతుంది. మరి ఇది కంఫర్ట్ గా ఉందా ? అంటే కచ్చితంగా ఉంటుంది. సంతోషంగా ఉన్నారా? అనడిగితే సరైన సమాధానం అయితే ఉండదు. అయితే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్త పరిచయాలు పెంచుకున్నప్పుడు, వారితో కలిసి చేసే సాహసాల వల్ల సంతోషం దక్కుతుంది. ఒక కొత్త ఫ్రెండ్ తో ఎప్పుడు బయటకు వెళ్లని మీరు ట్రెక్కింగ్ కి వెళ్ళారంటే… ఇంటికి వచ్చేసరికి శారీరకంగా అలసిపోతారు. కానీ మానసికంగా ఎనర్జిటిక్ గా, సంతోషంగా ఉంటారు.

2. అసౌకర్యం కూడా మంచిదే
కంఫర్ట్ అనేది హాయిగా ఉంటుంది. కానీ దీనివల్ల కొత్త అవకాశాలకు దూరమవుతారు. అసౌకర్యాన్ని జీవితంలోకి ఆహ్వానిస్తేనే కొత్త విషయాలను ప్రయత్నించగలుగుతారు. అలాగే తెలియని ప్రాంతాలను అన్వేషించడానికి, ఎన్నడూ సాధ్యం కానీ మార్గాల్లో మనల్ని మనం ఛాలెంజ్ చేసుకోవడానికి అసౌకర్యం అనేది మనల్ని ప్రోత్సహిస్తుంది. ఈ అసౌకర్య క్షణాల్లోనే నిజమైన ఆనందాన్ని పొందగలుగుతారు. ఒక్కసారి ఊహించుకోండి కఠినమైన ప్రాజెక్టును పూర్తి చేస్తే వచ్చే ఆనందం, భయాన్ని జయించిన సంతృప్తి అనేవి మాటల్లో వర్ణించలేనివి. ఈ ఫీలింగ్ మీ సొంతం కావాలంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు అడుగుపెట్టి తీరాల్సిందే.

- Advertisement -

3. బయటకు వెళ్లడం వెనకున్న సైన్స్
కొత్తగా, చాలెంజింగ్ గా ఉన్న ఏదైనా పనిని చేసినప్పుడే సజీవంగా, ఉత్సాహంగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వెనక సైన్స్ కూడా ఉంది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు శరీరానికి ఒత్తిడి స్థాయి పెరుగుతుంది. కానీ ఇది ఆందోళన వల్ల వచ్చే హానికరమైన ఒత్తిడి మాత్రం కాదు. దీన్ని శాస్త్రవేత్తలు యూస్ట్రెస్ అని పిలుస్తారు. ఇది ఎండార్ఫిన్ లను విడుదల చేసేలా మీ మెదడును ప్రేరేపిస్తుంది. ఫీల్ గుడ్ హార్మోన్ గా పిలవబడే ఈ ఎండార్ఫిన్ మీలో సంతోషాన్ని, క్రియేటివిటీని పెంచుతుంది.

4. పవర్ ఆఫ్ లర్నింగ్
కొత్త స్కిల్స్ ను నేర్చుకోవడం, తెలియని విషయం గురించి తెలుసుకోవడం వంటివి సంతృప్తిని కలిగిస్తాయి. అంటే కొత్త విషయాలను నేర్చుకోవడం కోసం మీ కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయట పెడుతున్నారు. దీనివల్ల కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

5. రిస్క్ అండ్ రివార్డ్
జీవితంలో ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత పెద్ద రివార్డులు సాధించగలుగుతారు. కంఫర్ట్ జోన్ నుంచి అడుగు బయట పెట్టడం అంటే రిస్క్ తీసుకుంటున్నట్టే. ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ గొప్ప అవకాశాలకు తెరతీసినట్టుగా అవుతుంది. రిస్క్ అనేది భయాలను అధిగమించడంలో హెల్ప్ చేస్తుంది. జీవితంలో అనివార్యమైన కఠినమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో మనకు నేర్పుతుంది. ఎదగడానికి, నేర్చుకోవడానికి ముఖ్యంగా ఆనందానికి కొత్త మార్గాలను కనుగొనడానికి ఇదొక మంచి లెసన్ అవుతుంది.

6. ద బ్యూటీ ఆఫ్ కనెక్షన్
కంఫర్ట్ జోన్ లోనే ఉండడానికి ఇష్టపడేవారు కొత్త రిలేషన్స్ ఏర్పరచుకోకుండా లేదా ఇప్పటికే ఉన్న రిలేషన్స్ తో కంఫర్ట్ గా ఉంటారు. దీనివల్ల అసంతృప్తిగా అనిపిస్తుంది. కొత్త వ్యక్తులతో కొత్త పరిచయాలు ఏర్పడినప్పుడే వాళ్లను అర్థం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నంలో ప్రేమ, స్నేహం, సానుభూతి వంటి ఎమోషన్స్ సంతోషాన్ని కలగజేస్తాయి.

7. ఫెయిల్యూర్
ఫెయిల్యూర్ అనేది మరొక కొత్త అవకాశానికి మార్గం లాంటిది. జీవితంలో ఎదురయ్యే ప్రతి ఎదురు దెబ్బ ద్వారా ఏదో ఒకటి నేర్చుకోండి. ఎందుకంటే గొప్ప వైఫల్యాలే గొప్ప విజయాలకు దారి తీస్తాయి.

8. ఇక ఆనందం కోసం అన్వేషణ అనేది గమ్యం కాదు ప్రయాణం.

ప్రతిరోజు మనల్ని మనం చాలెంజ్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి, కనెక్ట్ అవ్వడానికి, అన్వేషించడానికి కొత్త అవకాశాలను కల్పిస్తుంది. మనకు తెలిసిన వాటికి మించి మనం వేసే ప్రతి అడుగుతో కొత్త ఆనందాన్ని కనుగొంటాము. కానీ ఇదేం అంత ఈజీ కాదు. కాబట్టి కంఫర్ట్ జోన్ నుంచి బయటపడితే చాలదు కష్టపడాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు