Tollywood Directors: ఈ స్టార్ డైరెక్టర్స్ సోదరులు ఎవరో తెలిస్తే షాక్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రత్యేకించి ఈ ఇద్దరి దర్శకుల సోదరులు మాత్రం రాజకీయాలలో బిజీగా కొనసాగుతూ మంచి హోదాని అనుభవిస్తున్నారు.. అయితే ఏ రోజు కూడా ఈ తెలుగు దర్శకులు రాజకీయాల గురించి మన దగ్గర మాట్లాడింది లేదు.. తమ తోడబుట్టిన వారు ఇలా రాజకీయాల్లో ఉన్నారని, వారు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పనిచేస్తున్నారని ఆ పలుకుబడిని కూడా ఎప్పుడూ వినియోగించుకోవాలని చూడలేదు.. ఇక ఎవరికివారు యమునా తీరే అన్నట్టుగా ఎవరి ఇండస్ట్రీలో వారు సత్తా చాటుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.. మరి ఆ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో వారి సోదరులు ఎవరో ఇప్పుడు చూద్దాం..

పూరీ జగన్నాథ్ – ఉమా శంకర గణేష్
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు పూరీ జగన్నాథ్.. మహేష్ బాబు పవన్ కళ్యాణ్ లాంటి హీరోలకు కెరియర్ ని అందించిన ఈయన ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇకపోతే పూరీ జగన్నాథ్ కి తోడబుట్టిన ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు వైసీపీ నుంచి నరసాపురం ఎమ్మెల్యే అయిన ఉమాశంకర్ గణేష్ కాగా మరొకరు సాయిరాం శంకర్.. ప్రస్తుతం సాయిరాం శంకర్ తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరో గానే కొనసాగుతున్నారు.. ఇకపోతే పూరీ జగన్నాథ్ దర్శకుడిగా ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులను చూసినా ఏరోజు కూడా కుటుంబం యొక్క పలుకుబడిని వాడుకోలేదు.. పైగా వీరి సోదరులు రాజకీయాలలో బిజీగా ఉన్నప్పటికీ పూరీ జగన్నాథ్ వచ్చి ప్రచారం చేసి వారిని గెలిపించిన దాఖలాలు కూడా లేవు. అలాగని ఉమాశంకర్ గణేష్ కూడా తన సోదరుడు పూరీ జగన్నాథ్ ఇమేజ్ ని వాడుకోవాలని ఆశించలేదు.. అలా ఎవరికి వారు తమ రంగాలలో సక్సెస్ సాధించారు.

కురసాల కళ్యాణ్ కృష్ణ – కన్న బాబు
వైసీపీ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా పనిచేసిన కన్న బాబు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. కన్నబాబు పూర్తి పేరు కురసాల కన్నబాబు.. ఈయన సోదరుడే కురసాల కళ్యాణ్ కృష్ణ.. ఇక కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్నినాయన, రారండోయ్ వేడుక చూద్దాం, నేల టికెట్ , బంగార్రాజు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించి భారీ సక్సెస్ ను అందుకున్నారు.. అంతేకాదు నాగార్జునకు ఎంతో దగ్గర వాడైన కళ్యాణ్ కృష్ణ సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణిస్తూనే.. నిర్మాతగా కూడా అవతారం ఎత్తారు.. అయితే కళ్యాణ్ కృష్ణ ఏ రోజు కూడా తన పలుకుబడిని వాడుకోలేదు.. అలాగే కన్నబాబు కూడా తమ్ముడు గొప్ప దర్శకుడు అయినంత మాత్రాన తనకు క్యాంపెయిన్ చేసి పెట్టాలని ఎదురు చూడలేదు.. అలా అటు ఆ ఇద్దరు దర్శకులు.. ఇలా ఇటు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఏరోజు కూడా తమ సోదరుల పలుకుబడిని ఉపయోగించుకోకుండానే.. అటు రాజకీయరంగం ఇటు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి.. అటు ప్రజలు ఇటు అభిమానుల ఆదరాభిమానాలను సొంతం చేసుకున్నారు.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు