Personality Development : ఈ చిన్న అలవాట్లే ప్రశాంతతకు నెలవు

ప్రశాంతంగా ఉండటం అంటే మొహం ప్రశాంతంగా కనిపించడం కాదు. బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ మనసులో మాత్రం గందరగోళం సుడిగుండంలా తిరుగుతూ ఉంటుంది. మన చుట్టూ ప్రపంచం తలకిందులైపోయినప్పటికీ ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని అలవాట్లు ఉండి తీరాల్సిందే. సైకాలజీ ప్రకారం ప్రశాంతంగా ఉండడానికి హెల్ప్ చేసే ఆ చిన్న చిన్న అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. యాక్సెప్టెన్స్

Tips For peaceful life
బౌద్ధమతం, మైండ్ ఫుల్ నెస్ బోధించే అమూల్యమైన పాఠం యాక్సెప్టెన్స్. జీవితం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుందని అర్థం చేసుకోవాలి. అప్పుడే యాక్సెప్టెన్స్ అనేది అలవడుతుంది. మన జీవితంలో ఏం జరిగినా ఒత్తిడికి గురవ్వకుండా యాక్సెప్ట్ చేయగలిగితే ప్రశాంతత దక్కుతుంది. లేదంటే బాధ తప్పదు.

- Advertisement -

2. కంపాషన్

Tips For peaceful life
కరుణ అనేది మనశ్శాంతిని కాపాడుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కోపం లేదా కఠినమైన స్వీయ విమర్శ వంటి ప్రతికూల భావోద్వేగాలు మనశ్శాంతికి అడ్డంకిగా నిలుస్తాయి. నెగిటివ్ ఎమోషన్స్ అనే సుడిగుండంలో చిక్కుకునే బదులు దయగల మనస్తత్వంతో క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుంటే ప్రశాంతంగా బ్రతకగలుగుతారు.

3. మైండ్ ఫుల్ అప్రోచ్

Tips For peaceful life
మైండ్ ఫుల్ నెస్ అంటే మౌనంగా కూర్చోవడం, శ్వాసపై దృష్టి పెట్టడం మాత్రమే కాదు. ఇదొక జీవన విధానం. మైండ్ ఫుల్ నెస్ అంటే ప్రస్తుతం మనం చేస్తున్న పనులపై పూర్తిగా నిమగ్నమై పోవడం. జడ్జిమెంట్ తో పని లేకుండా మన ఆలోచనలు భావాలు ఫీలింగ్స్ పై శ్రద్ధ పెట్టడం. తరచుగా గతం గురించి పశ్చాతాప పడుతూ లేదా భవిష్యత్తు గురించి ఆందోళన పడుతూ వర్తమానంలో జీవించడం మర్చిపోతాము. కానీ మైండ్ ఫుల్ నెస్ ను ప్రాక్టీస్ చేస్తే మనశ్శాంతికి అడ్డంకిగా మారే చింతల్లో మునిగిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది.

4. మినిమల్ ఈగో

Tips For peaceful life
అహంకారం పెరిగితే అది సంఘర్షణకు, ఒత్తిడికి, అసౌకర్యానికి దారి తీస్తుంది. కాబట్టి అహంకారాన్ని తగ్గించుకోవాలంటే నేను లేదా నాది అనే పదాలను ఉపయోగించడం తగ్గించండి. అహాన్ని తగ్గించుకున్నప్పుడే జీవితం మనకు అందించే వాటిని సంతోషంగా యాక్సెప్ట్ చేయగలుగుతాము. ఉన్నదానితో సంతృప్తి పడడం వల్ల మనశ్శాంతి దక్కుతుంది. కాబట్టి మినిమల్ ఈగోతో జీవించడానికి ప్రయత్నించండి.

6. ప్రాక్టీస్ డిటాచ్మెంట్

Tips For peaceful life
జీవితం కోరికలు, భయాలు, ఆస్తులు, సంబంధాలు, సొంత గుర్తింపులకు సంబంధించిన ఆరాటాలతో నిండిపోయి ఉంటుంది. ఇవన్నీ బాధలకు దారి తీసే అంశాలే. అంటే ఉన్నదాన్ని కోల్పోతామేమో లేదా మనకు కావలసినదాన్ని పొందలేమేమో అనే భయం ఆందోళనను పెంచుతుంది. కాబట్టి ఏది శాశ్వతం కాదు అనే విషయాన్ని గ్రహిస్తే వీటన్నింటినీ వదిలేయగలుగుతారు. అలా వదిలేసినప్పుడే ప్రశాంతత అనేది దక్కుతుంది.

7. కృతజ్ఞతా భావం

Tips For peaceful life
కృతజ్ఞతా భావం అనేది శాంతియుత మనస్తత్వాన్ని కొనసాగించడంలో కీలక పాత్రను పోషిస్తుంది. ఇది మానసిక స్థితిని మెరుగుపరిచి, ఒత్తిడి, ఆందోళనను తగ్గించే ఒక పాజిటివ్ అంశం. కృతజ్ఞతా భావంతో ఉన్నప్పుడే మనకు లేని వాటికంటే ఉన్న వాటిపై దృష్టి పెట్టి సంతృప్తిగా బ్రతకగలుగుతాము. ఇంకేముంది ఫలితంగా ప్రశాంతంగా ఉంటాము.

8. అసౌకర్యాన్ని స్వాగతించండి
అసౌకర్యం అనేది జీవితంలో ఒక భాగమని అర్థం చేసుకోవాలి. దాని నుంచి పారిపోతే బాధ మాత్రమే మిగులుతుంది. కానీ అసౌకర్యాన్ని స్వాగతించి, దానిని ఎదుర్కోగలిగితే సంతోషంతో పాటు ప్రశాంతత కూడా దక్కుతుంది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు