Gayatri Bhardwaj: రామ్ చరణ్ అంటే చచ్చేంత ఇష్టం అంటున్న బాలీవుడ్ బ్యూటీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ రోజురోజుకిపెరిగిపోతూనే ఉంది.
మరి ముఖ్యంగా బాలీవుడ్ లో ఆయనకున్న ఫాలోయింగ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న బాలీవుడ్ నటినటులు చాలా మంది తెలుగు హీరోల గురించి మాట్లాడటం జరుగుతూ వస్తుంది. అయితే అందులోను తరుచుగా రామ్ చరణ్ పేరు వినిపిస్తుండటం విశేషం.

అయితే రామ్ చరణ్ అంటే బాలీవుడ్ నటి గాయత్రి భరధ్వాజ్ కు చచ్చేంత ఇష్టమట. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పటి నుంచి రామ్ చరణ్ పై ఈ బ్యూటీకి యమ క్రష్ ఏర్పడిందట ఆమె నటించిన లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వర రావు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న గాయత్రి భరధ్వాజ్ రామ్ చరణ్ గురించి తన మనసులో మాటను బయటపెట్టింది.

మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన గాయత్రి భరధ్వాజ్ కు సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ అంత ఇంత కాదు. అయితే నిజానికి 2018 లోనే ఆకాష్ పూరి హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా పరిచయమవ్వాల్సిన ఈ బ్యూటీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఇక ప్రస్తుతం రవితేజ తో టైగర్ నాగేశ్వర రావు సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య దసరా కానుకగా రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమా గనక హిట్ అయితే గాయత్రి భరధ్వాజ్ కు అవకాశాలు క్యూ కట్టడం కన్ఫామ్ అనే చెప్పాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు