Pan India Movie : ఈ సారైనా ఫలిస్తుందా ?

స్థాయితో సంబంధం లేదు. హీరోలందరి మాట ఒకటే. అదే పాన్ ఇండియా రేంజ్. తెలుగులో సరైన మార్కెట్ లేని హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా మంది హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లను ప్రకటించారు. షూటింగ్ లను కూడా జరుపుకుంటున్నారు. అలాగే కొన్ని సినిమాలు ఇప్పటికే విడుదల అయ్యాయి. టాలీవుడ్ లో అగ్ర హీరోలు కూడా వరుసగా ఇలాంటి సినిమాలే చేస్తున్నారు. అందులో కొన్ని నిరాశపరిస్తే, మరికొన్ని అఖండ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.

తాజాగా మెగా స్టార్ చిరంజీవి కూడా పాన్ ఇండియా రాగం పట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఒక సారి పాన్ ఇండియా సినిమా అంటూ సైరా నరసింహ రెడ్డి సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగులో పర్వాలేదు అనిపించినా, ఇతర భాషల్లో మాత్రం బొక్క బోర్లా పడింది. మరోసారి పాన్ ఇండియా రేంజ్ లో సినిమాను విడుదల చేయాలని చిరంజీవి తెగ ట్రై చేస్తున్నాడట.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సినిమాల్లో గాడ్ ఫాదర్ ఒకటి. ఈ సినిమా మలయాళంలో వచ్చిన లూసిఫర్ కు తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. సల్మాన్ కు ఉన్న హిందీ మార్కెట్ ను ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. మలయాళం మినహా అన్ని భాషల్లో గాడ్ ఫాదర్ ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరీ చిరు ప్రయత్నాలు ఫలిస్తాయా, పాన్ ఇండియా రేంజ్ లో గాడ్ ఫాదర్ హిట్ అవుతుందా అని తెలియాలంటే గాడ్ ఫాదర్ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు