Tollywood: శుభారంభం

తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచింది అన్నట్లు సాఫీగా సాగుతున్న జీవితాల్లోకి కరోనా మహమ్మారి వచ్చి భారీ బ్రేక్ వేసింది. కరోనా వలన ప్రొబ్లెమ్స్ ఫేస్ చేసిన ఎన్నో పరిశ్రమల్లో సినీపరిశ్రమ కూడా ఒకటి.2020 సంక్రాంతి లో వచ్చిన అల వైకుంఠపురంలో, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో టాలీవుడ్ పరిశ్రమకి మంచి ఊపు వచ్చింది. ఆ తరుణంలోనే భారీ ప్రాజెక్ట్స్ షూటింగ్ దశలో ఉన్నాయి. కానీ ఊహించని విధంగా కరోనా లక్డౌన్ వలన షూటింగ్ లు నిలిపివేయడం. సినిమా విడుదలలు వాయిదా పడటం. ఇలా గడ్డు కాలం నడిచింది.

ఎట్టకేలకు మంచి రోజులు వచ్చి పుష్ప, ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ వర్షం కురిపించి తెలుగు సినిమా సత్తాను చాటాయి. సర్కారు వారి పాట పరవాలేదు అనిపించుకున్నా, ఆచార్య సినిమా నిరాశపర్చింది. వీటితో పాటుగా షూటింగ్స్ జరుపుకున్న కొన్ని మిడ్ రేంజ్ సినిమాలు ఎక్కువశాతం నిరాశనే మిగిల్చాయి. సినిమాలకు మంచి పాజిటివ్ టాక్ వచ్చినా కలక్షన్స్ రాని పరిస్థితి. జూన్ 17 న రిలీజైన విరాటపర్వం ఆ తరువాత విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకుడికి నిరాశనే మిగిల్చాయి. జులై లో విడుదలైన పక్కా కమర్షియల్, హ్యాపీ బర్త్ డే, థాంక్యూ , రామారావు ఆన్ డ్యూటీ ఏ సినిమాలు గొప్పగా ఆడలేదు.

మొత్తానికి ఇప్పుడు మళ్ళీ సినీ పరిశ్రమకు మంచి రోజులు వస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆగష్టు 5న రిలీజైన బింబిసార, సీతా రామం సినిమాలు మంచి పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఆగష్టు 12 న రిలీజ్ కాబోయే మాచర్ల నియోజక వర్గం చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. కార్తికేయ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టాడు చందు మొండేటి. ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది కార్తికేయ-2 ఈ సినిమాకి ఆల్రెడీ ఒక పాజిటివ్ వైబ్ ఉంది. సెన్సార్ మెంబెర్స్ కూడా ఈ సినిమాపై ప్రసంశలు కురిపించినట్లు వార్తలు వచ్చాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా చేస్తున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. మొత్తంగా ఈ నెలలో రిలీజ్ కాబోయే సినిమాలు, ఆ సినిమాలకున్న పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే తెలుగు సినిమాకి శుభారంభం మొదలయింది అనిపిస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు