Trivikram: అప్పుడు మహేష్ బాబు , ఇప్పుడు కళ్యాణ్ బాబు. పెద్ద ప్లానే ఇది

ఇండస్ట్రీలో ఇప్పుడున్న జనరేషన్ లో స్టార్ హీరోస్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు. తెలుగులో వీళ్లకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఫ్యాన్స్ మధ్యే ఎక్కువగా ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అది కొంచెం తగ్గుతూ వచ్చింది అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలను రీ రిలీజ్ చేస్తే వాటికి దక్కే ఆదరణ మరో హీరో సినిమాకు దక్కదని కూడా రీసెంట్ డేస్ లో ప్రూవ్ అయింది.

ఇకపోతే వీరిద్దరూ సినిమాలకి ఉండే క్రేజ్ మామూలుది కాదు. వీరిద్దరితో మంచి చనువున్న ఏకైక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తో చేసిన మొదటి సినిమా జల్సా. ఆ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ సంజయ్ సాహూ క్యారెక్టర్ని డిజైన్ చేసిన విధానం ఎప్పటికీ మర్చిపోలేము. అసలు సంజయ్ సాహు క్యారెక్టర్ ని మహేష్ బాబు వాయిస్ ఓవర్ లో విన్నప్పుడు ఆడియన్స్ కి ఒక హై వచ్చింది.
పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని, మరో స్టార్ హీరో ఎలివేట్ చేస్తుంటే ఆ కిక్ ఒక రేంజ్ లో అనిపించింది.

ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి పోస్టర్ కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ప్రతి పోస్టర్ లో మహేష్ బాబు స్వాగ్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన “దమ్ మసాలా” సాంగ్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా సంక్రాంతి కానుక జనవరి 12న రిలీజ్ కానుంది.

- Advertisement -

అయితే ఈ సినిమా గురించి ఒక స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. ఈ సినిమాలో కొన్ని సీన్స్ లో మహేష్ బాబుకి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. జల్సా సినిమా కోసం మహేష్ ముందుకొస్తే ఇప్పుడు గుంటూరు కారం సినిమా కోసం పవన్ కళ్యాణ్ ముందుకు రావడం అనేది ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏదేమైనా ఇద్దరితో మంచి చనువుండటం వలన ఇరు వర్గాల ఫ్యాన్స్ ని కూడా ఒకే దారిలో ముందుకు తీసుకెళ్తున్నాడు త్రివిక్రమ్. ఈ వార్త నిజమైతే థియేటర్లో ప్రేక్షకులకు పూనకాలు ఖాయమని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు