Trivikram Srinivas: ఒకే ఊరోళ్లు కలవడానికి ఇన్నాళ్లు పట్టింది

త్రివిక్రమ్ శ్రీనివాస్, స్వయంవరం సినిమాతో మాటల రచయితగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టి అద్భుతమైన సంభాషణలను సినిమాలకు అందిస్తూ మంచి హిట్లను సాధించాడు. మామూలుగా అందరూ రాయగలరు. కానీ త్రివిక్రమ్ రాసిన మాటలను ప్రేక్షకులు తమతోపాటు తీసుకెళ్లే విధంగా రాస్తాడు. నలుగురు కలిశారంటే వారిలో ఇద్దరైనా త్రివిక్రమ్ డైలాగులలో ఒకటైన పేలుస్తారు. మామూలుగా కొందరు మాటలు ఆడుతుంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం మాటలతో ఆడుకుంటాడు. అందుకని త్రివిక్రమ్ ని మాటల మాంత్రికుడు అని అంటుంటారు.

నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటివరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరియర్ లో తరుణ్, నితిన్ మినహాయిస్తే ఒక్క చిన్న హీరోతో కూడా సినిమాను చేయలేదు. త్రివిక్రమ్ ఇప్పటివరకు ఎక్కువ శాతం స్టార్లతోనే వర్క్ చేశాడు. ఇకపోతే ఇప్పుడున్న స్టార్స్ లో ప్రభాస్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో రెండు సినిమాలు రిలీజ్ కి దగ్గరలో ఉన్నాయి.

ఇకపోతే ప్రభాస్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నట్లు వినికిడి. ఏదేమైనా ఎప్పటికైనా వీరిద్దరూ కలిసి సినిమాను చేస్తారు అని చాలామందికి ఒక ఆలోచన ఉండేది. ఇద్దరు ఒకే ప్రాంతానికి చెందిన వారు కాబట్టి ఎప్పటికైనా వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని ప్రేక్షకులకి ఒక అంచనా ఉంది.

- Advertisement -

అలానే త్రివిక్రమ్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఫ్యామిలీ మూవీగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇదివరకే ప్రభాస్ కెరియర్ లో మిస్టర్ పర్ఫెక్ట్ వంటి ఫ్యామిలీ హిట్ లభించింది. ఇంకా త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది.? త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీ సినిమాలకి కేరాఫ్ అడ్రస్. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే అది ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది ప్రేక్షకులకి ఒక అంచనా ఉంది.
ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు