Sandeep Reddy: మళ్ళీ సంచలనాలకు దారి తీస్తాడా.?

చాలామంది దర్శకులు తమను తాము తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం చేసుకోవడానికి నానా కష్టాలు పడుతుంటారు. ఒక శుక్రవారం ఒక దర్శకుడు కెరియర్ ని మార్చేస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే అప్పటివరకు తన కన్న కలలు, తను రాసిన కథలు ఏదో ఒక రోజు సినిమా రూపంలో బయటకు వస్తాయి. ఆ రోజు ఆ దర్శకుడు పేరు ఆ సినిమా రిజల్ట్ ని బట్టి మార్మోగిపోతుంది. సినిమా ఫెయిల్ అయితే మరుగైపోతుంది. అలా అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగ ఫస్ట్ సినిమాతోనే సంచలన దర్శకుడిగా మారిపోయాడు.

తన మొదటి సినిమా రిజల్ట్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, తెలుగు సినిమా శివ ముందు శివ తర్వాత అని ఎలా అయితే చెప్పుకుంటారో అలానే అర్జున్ రెడ్డి కి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అని చెప్పుకునే స్థాయిలో ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక్కడ ఆ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేనిది. అలానే అదే సినిమాని సాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ అంటూ తెరకెక్కించాడు బాలీవుడ్లో. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా అనేక సంచలనాలకి దారితీసి దాదాపు 250 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసింది.

సందీప్ రెడ్డి వంగ అంటే ఒక బ్రాండ్ అయిపోయాడు అందుకే తన తదుపరి సినిమా కూడా బాలీవుడ్ నటుడైన రణబీర్ కపూర్ తో అనిమల్ సినిమాను తెరకెక్కించాడు. ఇప్పుడు అనిమల్ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ సందీప్ రెడ్డి వంగ స్థాయిలోనే ఉంది అని చెప్పొచ్చు. ఇకపోతే ఈ సినిమా పాటలు కూడా అద్భుతమైన రెస్పాన్స్ ను పొందుకుంటున్నాయి.

- Advertisement -

చాలామంది ప్రేక్షకులు ఈ సినిమా ట్రైలర్ గురించి వేచి చూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ని నవంబర్ 21న రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అలానే ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇకపోతే బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నా అన్ స్టాపబుల్ షో లో పాల్గొంది ఈ మూవీ టీం. ఇకపోతే నవంబర్ 21 రిలీజ్ కానున్న ఈ టీజర్ ఏ స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో, సినిమాపై అంచనాలను ఏ మేరకు పెంచుతుందో తెలియాలి అంటే రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు