Namitha: ఆ వ్యాధే నమిత కెరియర్ ను నాశనం చేసిందా..?

చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో శాశ్వతంగా చెరగని ముద్ర వేసుకున్న అతి తక్కువ మంది నటీనటులలో హీరోయిన్ నమిత కూడా ఒకరని చెప్పవచ్చు. సొంతం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వెంకటేష్ సరసన జెమిని, ప్రభాస్ సరసన బిల్లా వంటి సినిమాలలో నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది. ఇక అలా తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా మారిన సమయంలోనే అనుకోకుండా బరువు పెరిగిపోయి అవకాశాలను కూడా కోల్పోయింది.

ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మెరుపు తీగలా సన్నగా నాజూగ్గా ఉన్న నమిత అనతి కాలంలోనే అధిక శరీర బరువుతో సినీ అవకాశాలను కోల్పోయింది. ఒకప్పుడు ఈమెను సినిమాలలో తీసుకోవడానికి ఎగబడ్డ దర్శక నిర్మాతలు కూడా ఈమె అధిక శరీర బరువును చూసి అవకాశాలు ఇవ్వడం మానేశారు. దాంతో సినిమా కెరియర్ కాస్త ఆగిపోయింది. అయితే అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు లభించినప్పటికీ కూడా సరైన స్థాయిలో పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్రలు రాకపోవడంతో శాశ్వతంగా తెలుగు ఇండస్ట్రీకి దూరమైందని చెప్పాలి.

ఇక ప్రస్తుతం తమిళంలో సినిమా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. నమిత ఒక వ్యాధితో బాధపడుతుందని అందుకే ఆమె అధిక శరీర బరువుకు కారణం అయ్యింది అనే వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా హీరోయిన్లు తమ అందం విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే నమిత కూడా తన ఫిట్నెస్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా భారీగా బరువు పెరుగుతూ వచ్చింది. తద్వారా సినిమా అవకాశాలు కరువయ్యాయి. అయితే ఇలా ఉన్నట్టుంది బరువు పెరగడానికి కారణం ఆమె పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లడమే కాదు థైరాయిడ్ వంటి సమస్యలతో కూడా బాధపడుతోందట. ఈ సమస్యల కారణంగానే ప్రతిరోజు మెడిసిన్స్ వాడుతూ ఉండడం వల్ల ఈమె శరీర బరువు పెరగడానికి కారణం అయిందని సమాచారం.

- Advertisement -

ఇలా అధిక బరువు కారణంగా సినిమాలలో అవకాశాలు కూడా కోల్పోయింది. దీంతో సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యి 2017 వ సంవత్సరంలో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకున్న ఈమె ఆ తర్వాత గత ఏడాది ఇద్దరూ మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం గృహిణిగా ఇంటికే పరిమితమైన నమిత సరైన అవకాశాల కోసం ప్రయత్నం చేస్తోంది. మరి ఇప్పటికైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు