Pawan Kalyan: ఇంతకీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు “బ్రో”?

టాలీవుడ్ లో ఈ ఏడాది ఆదిపురుష్ తర్వాత మరో పెద్ద సినిమా రాలేదు. ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలన్నీ చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలే. ఇప్పుడు పెద్ద సినిమాల టైమ్ దగ్గర పడుతుంది. అది పవన్ కళ్యాణ్ ద్వారానే మొదలుకానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కాంబో లో వస్తున్న “బ్రో” సినిమా జులై 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే.

అయితే టాలీవుడ్ లో ఈ సినిమాకి సంబంధించి ఏ హడావిడి జరుగుతున్నట్టు అనిపించడం లేదు. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమాపై ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లాంటివి ఇంకా ఇవ్వలేదు. ఎదో సాయిధరమ్ తేజ్ కొంచెం ట్రై చేస్తున్నా తన ఒక్కడివల్ల ప్రమోషన్స్ చేయడం కుదరదని చిత్ర యూనిట్ గ్రహించాలి.

ఇక బ్రో సినిమా రిలీజ్ కి ఇంకా 12 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయినా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ఒక వేళ ఆ ఉద్దేశం లేకపోయినా, కనీసం సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసే ఆలోచన అయినా ఉందా? లేదా? అంటూ ఫ్యాన్స్ మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు. అసలే రీమేక్ సినిమా, అందులోను ఇప్పటివరకు సరైన బజ్ లేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా నైనా సినిమాపై హైప్ పెంచుతారనుకుంటే చిత్ర యూనిట్ అదేమీ పట్టనట్టు ఉంది.

- Advertisement -

కనీసం ఈవెంట్ అప్డేట్ అయినా ఇవ్వమని ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా అడుగుతున్నారు. అయితే ఇంకా ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 23న లేదా 24న నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా, పవన్ కళ్యాణ్ బ్రో ఈవెంట్ కి రాకపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఈవెంట్ కి రామ్ చరణ్, లేదా చిరంజీవి గెస్ట్ గా వచ్చే అవకాశం ఉందని నెటిజన్స్ అంటున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు