Nag Ashwin: ప్రాజెక్ట్ K లో ప్రభాస్ డబుల్ యాక్షన్?

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియెస్ట్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న సినిమా “ప్రాజెక్ట్ కే”. ఈ సినిమాపై ఒక్క టాలీవుడ్ లోనే కాదు ఇండియా వైడ్ గా భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు.

అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం. అందులో ఒకటి నెగిటివ్ రోల్ కూడా అయి ఉంటుందని అంటున్నారు. ఇప్పటివరకు పెద్దగా ఆ న్యూస్ పై నమ్మకం లేకపోయినా, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక పోస్టర్ ద్వారా ఆ డౌట్ బలపడింది. ఆ పోస్టర్ లో రెండు చేతులు చూపిస్తూ, ఆ చేతులు ఒకదానికొకటి ఢీ కొంటున్నట్టు డిజైన్ చేసారు. దీన్ని బట్టి ప్రభాస్ హీరోగా, విలన్ గా రెండు పాత్రలు తానే చేస్తున్నట్టు అంటున్నారు.

ఇక ఆ పాత్రల్లో హీరో వైపు అమితాబ్ పాత్ర ఉంటే, విలన్ వైపు కమల్ పాత్ర ఉంటుందని అంటున్నారు. ఇక మరి కొందరి వాదన ఏంటంటే, రిలీజ్ చేసిన పోస్టర్లో ఎదో ఒక చేయి అమితాబ్ ది అయ్యి ఉండొచ్చని అంటున్నారు. అయితే దాని గురించి క్లారిటీ రావాలంటే జులై20న విడుదలవుతున్న “ప్రాజెక్ట్ కే” గ్లిమ్ప్స్ చూస్తే గాని తెలియదు. ఇక ఈ సినిమాలో దీపికా పదుకునే, దిశాపఠాని హీరోయిన్లుగా నటిస్తుండగా, వీరిలో కూడా ఒకరు నెగిటివ్ రోల్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు