Salaar: డైనోసార్ కు బిగ్ టార్గెట్… బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

డైనోసార్ ఎంట్రీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాక్షన్ ప్రియులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. మరో ఐదు రోజుల్లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఎంత? ఎన్ని కలెక్షన్లు రాబడితే సినిమా హిట్ అవుతుంది? అనే వివరాలు బయటకు వచ్చాయి. మరి సలార్ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టాలి? అంటే…

తెలంగాణలో ఈ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా థియేత్రికల్ రైట్స్ 65 కోట్లకు అమ్ముడు అయ్యాయి. ఒక్క తెలంగాణలోనే ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ వసూలు చేస్తే అప్పుడు గాని డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవ్వరు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ఈ మూవీ రైట్స్ 95 కోట్లకు అమ్ముడయ్యాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీ 150 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ చేరుకోవాలంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 250 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంటుంది. ఇక ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి సౌత్ స్టేట్స్ నిర్మాతలు సొంతంగా అడ్వాన్సుగా సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే బిజినెస్ ప్రకారం ఈ మూడు రాష్ట్రాలకు కలిపి దాదాపు 65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి దాదాపు 130 కోట్ల గ్రాస్ వసూలు చేస్తేనే గాని ఈ మూడు రాష్ట్రాల్లో “సలార్” మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వదన్నమాట. ఇవి సౌత్ లెక్కలు మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా “సలార్” బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఏకంగా ఎనిమిది వందల కోట్ల గ్రాస్ కొల్లగొట్టాల్సి ఉంటుంది.

టోటల్ గా “సలార్” మూవీ సౌత్ ఇండియాలో 380 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇక నార్త్ ఇండియా విషయానికి వస్తే అక్కడ ఈ మూవీ 230 కోట్ల గ్రాస్ సంపాదించాల్సి ఉంటుంది. ఈ రెండిటినీ కలిపితే కేవలం ఇండియాలోనే “సలార్” మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ 610 కోట్ల గ్రాస్. ఇప్పుడు ఓవర్సీస్ వివరాలు తెలుసుకుందాం. అక్కడ ఈ చిత్రం పబ్లిసిటీ, ప్రింట్ ఖర్చులతో సహా 75 కోట్లకు అమ్ముడైంది. ఓవర్సీస్ లో లాభాల పంట పండాలంటే 150 కోట్ల గ్రాస్ సాధించడం “సలార్” టార్గెట్. ఇక ఈ లెక్కలన్నీ చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా “సలార్” పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులతో కలిపి దాదాపు 800 కోట్ల గ్రాస్ రేంజ్ ని కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే “సలార్” నాలుగు వందల కోట్ల షేర్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న “సలార్” ఫీవర్ చూస్తుంటే మన డార్లింగ్ ఈ టార్గెట్ ను అలవోకగా చేరుకుంటాడేమో అనిపిస్తుంది. ఇక ఇప్పటికే నార్త్ ఇండియాలో ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. మరి ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? “సలార్” నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుందా? అనేది తెలియాలంటే డిసెంబర్ 22 దాకా వెయిట్ చేయక తప్పదు.

- Advertisement -

 

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు