Salaar: ఒడియమ్మ లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్… కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రశాంత్ నీల్

దేశమంతా ఎప్పుడు అని ఎదురు చూస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మరికొన్ని రోజుల్లోనే థియేటర్లలో సందడి చేయబోతోంది. డిసెంబర్ 22న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా రిలీజ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే “సలార్” మూవీ ప్రమోషన్స్ విషయంలోనే అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటిదాకా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ గురించి జరిగిన పలు ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే పరిస్థితి చూస్తుంటే లాస్ట్ మినిట్ లో ప్రశాంత్ నీల్ ప్లాన్ చేంజ్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? లాస్ట్ మినిట్ లో ప్రశాంత్ నీల్ ఏం చేంజ్ చేశాడు? వివరాల్లోకి వెళ్తే…

“సలార్” మూవీ ప్రమోషన్స్ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు మేకర్స్. ఇంత పెద్ద సినిమాకు చాలా తక్కువ ప్రమోషనల్ కంటెంట్ ను మాత్రమే ప్లాన్ చేశారు. ప్రస్తుతం సినిమాకి ఉన్న హైప్ సరిపోతుందని, ప్రత్యేకంగా మరింత అంచనాలను పెంచాల్సిన అవసరం లేదని చిత్ర బృందం భావిస్తోంది. ఇక కొన్ని రోజుల క్రితం సలార్ మూవీ ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. దానికి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రెండవ ట్రైలర్ ను రిలీజ్ చేసి, అభిమానుల ఆకలిని తీర్చబోతున్నారు మేకర్స్ అని ప్రచారం జరిగింది. అయితే అనుకున్నట్టుగానే ఈ మూవీ సెకండ్ ట్రైలర్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక రెండో ట్రైలర్ తో పాటు, ఈ సినిమాకు సంబంధించి రెండు ప్రత్యేకమైన ఇంటర్వ్యూలను ప్లాన్ చేశారు. ఆ రెండు ఇంటర్వ్యూలు మొత్తం ఐదు భాషలలో సబ్ టైటిల్స్ తో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అందులో ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ శృతిహాసన్ హోస్ట్ గా, మిగతా హీరోలను చిత్ర బృందాన్ని ప్రశ్నలు అడగగా, ఇంకో ఇంటర్వ్యూలో ప్రశాంత్ నీల్, ప్రభాస్, రాజమౌళి కాంబోలో ఉండబోతోంది అని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ లాస్ట్ మినిట్ లో ప్లాన్ మొత్తం చేంజ్ చేశాడు. ప్రశాంత్ నీల్ ఆదివారం తెలుగు మీడియాతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొంటాడు అనే పుకార్లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఈ సినిమాకు సంబంధించి ఆశించిన రేంజ్ లో ప్రమోషన్స్ లేకపోవడంతో ఇది మంచి ఈవెంట్ అవుతుందని అభిమానులు భావించారు. కానీ తీరా చూస్తే అసలు ప్రశాంత్ నీల్ ప్రెస్ మీట్ లేనట్టే కనిపిస్తోంది. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ట్రైలర్ రిలీజ్ పై కాన్సెప్ట్ చేయడం వల్లే ప్లాన్లో మార్పు జరిగిందా? లేక ఇంకేదైనా సమస్య కారణంగా ఈ ప్రశ్నోత్తరాల సెషన్ ఆలస్యం అవుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇక రెండు ఇంటర్వ్యూలలో ఒకటి సోమవారం బయటకు రాబోతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు