Varun Tej : క్రేజీ డైరెక్టర్ తో..

మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్ ఒకరు. “ముకుంద” మూవీతో టాలీవుడ్ కి వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లోనే వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొన్నాడు. “ఫిదా” సినిమాతో సక్సెస్ ట్రాక్ అందుకున్నాడు. ఆ తర్వాత కంచె, తొలిప్రేమ, ఎఫ్ 2 , గద్దల కొండ గణేష్ చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. ఆ తర్వాత బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన “గని” బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడింది. ఇటీవల ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు వరుణ్ తేజ్. ఈ సినిమా కమర్షియల్ గా వర్క్ అవుట్ అయినప్పటికీ, ఆశించిన స్థాయిలో జనాలను మెప్పించలేకపోయింది.

తాజాగా ఈ మెగా హీరో గురించి టాలీవుడ్ ఒక వార్త వినిపిస్తుంది. వరుణ్ తో సినిమా చేయడానికి ఓ యంగ్ డైరెక్టర్ రెడీ అవుతున్నట్లు సమాచారం. కార్తికేయ2 తో సంచలనం క్రియేట్ చేసిన దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చందు మొండేటి తర్వాత చిత్రం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో దాదాపు ఖరారు అయినట్లే తెలుస్తోంది. వరుణ్ తేజ్ కోసం సినిమా చేసేందుకు కథ రెడీ చేయమని చందు మొండేటిని అల్లు అరవింద్ కోరినట్లు తెలుస్తోంది. ఈ దర్శకుడితో వరుణ్ తేజ్ మూవీ కన్ఫామ్ ఐతే మెగా హీరో ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు చేరినట్లే. దీనిపై త్వరలోనే గీతా ఆర్ట్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే సూచనలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు