Vaishnavi Chaitanya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బేబీ వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya

సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆనంద దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించిన ఈ బేబీ సినిమా జులై 14 న థియేటర్స్ లో రిలీజై, మీడియం రేంజ్ సినిమాలోనే సంచలన విజయం సాధించింది. అయితే బేబీ సినిమా బిగ్గెస్ట్ సక్సెస్ అయిన ఇన్నిరోజులకు వైష్ణవి చైతన్యను ఒక బంపర్ ఆఫర్ వరించింది.

నిన్న మొన్నటి దాకా బేబీ సినిమా హిట్టైన వైష్ణవి కి వేరే సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో.. వైష్ణవి కెరీర్ బేబీ సినిమాతో అయిపోయినట్టే మళ్ళి వైష్ణవికి ఇక షార్ట్ ఫిలిమ్స్ ఏ దిక్కు అంటూ వార్తలు వచ్చాయి. కాగా గీత ఆర్ట్స్ వంటి కొన్ని పెద్ద బ్యానర్ లు వైష్ణవి తో సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాయని అప్పుడప్పుడు వార్తలు వినిపించిన ఇప్పటి వరకు వైష్ణవి
నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి కన్ఫర్మేషన్ వార్త రాలేదు.

ఇక లేటెస్ట్ గా చూస్తే బేబీ విష్ణవి చైతన్య.. సిద్దు జొన్నలగడ్డ తో సినిమా చేయడానికి రెడీ అవుతోందని టాక్ వినిపిస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్దు హీరోగా ఇటీవలనే ఒక సినిమా ప్రారంభమైన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో సిద్దు కు జోడిగా వైష్ణవి చైతన్య ను తీసుకోబోతున్నారని టాక్. మరీ ఈ వార్త గనక నిజమై.. వైష్ణవి సిద్దు తో జోడి కడితే వైష్ణవి జాతకం మారిపోయినట్టే అని టాక్.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు