Ram charan : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్

Ram charan

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ క్రేజ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశాలు దాటి విస్తరించిన విషయం తెలిసిందే. అందుకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాస్త ప్రస్తుతం గ్లోబ్లల్ స్టార్ పేరుతో వార్తలో నిలుస్తున్నాడు. ఇటీవలనే ఆయన భార్య ఉపాసన కొణిదెల పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తండ్రిగా ప్రమోషన్ తీసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం సినిమాల షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకొని ఉపాసనకు తోడుగా ఉంటున్నాడు.ram charan

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చెంజర్ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ డిసెంబర్ కల్లా గేమ్ చెంజర్ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి, ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బుచ్చి బాబుతో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే బుచ్చి బాబు సినిమాకు సంబంధించి ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా జరుగుతుండగా అంతలోనే రామ్ చరణ్ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ నడుస్తోంది.

అదేంటంటే రామ్ చరణ్ తేజ్ త్వరలోనే ఒక భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నాడట. అది కూడా టీం భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ అని టాక్ వినిపిస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా గతంలో ఢిల్లీలో ఒక ఈవెంట్ కు హాజరైన రామ్ చరణ్ బాలీవుడ్ లో తప్పకుండ సినిమా చేస్తానని అక్కడి ప్రేక్షకులకు మాటా ఇచ్చాడు. అలాగే తనకు విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని ఒకవేళ ఆయన బయోపిక్ లో నటించాల్సి వస్తే ఆలోచించకుండా ఓకె చెప్పేస్తానని చెప్పాడు. మరీ రామ్ చరణ్ మాటలను సీరియస్ గా తీసుకున్న బాలీవుడ్ ఫిలిం మేకర్స్ నిజంగానే రామ్ చరణ్ తో విరాట్ కోహ్లీ బయోపిక్ చేయించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ లాక్ అయ్యేలాగా ఉందని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు