Sankranti War : హీట్ పెరుగుతుంది

సంక్రాంతి వచ్చిందంటే.. పండుగ వాతావరణం ఉంటుంది. అదే సమయంలో థియేటర్స్ వద్ద యుద్ధ వాతావరణం ఉంటుంది. స్టార్ హీరోల సినిమాలు ఎక్కువ శాతం సంక్రాంతి బరిలోనే ఉంచాలని అనుకుంటారు. దీంతో సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ వద్ద పోరు భారీ స్థాయిలో ఉంటుంది. ప్రతి ఏడాది లాగే వచ్చే ఏడాది కూడా సంక్రాంతి వార్ కాస్త గట్టిగానే ఉన్నట్టు తెలుస్తుంది. సంక్రాంతికి ఇంకా రెండు నెలలు ఉండగానే.. ఇప్పుడే ఆ వేడి వాతావరణం కనిపిస్తుంది.

వచ్చే ఏడాది సంక్రాంతికి ముందుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఆది పురుష్ సినిమాను బుక్ చేసుకున్నాడు. అలాగే తమిళ దళపతి విజయ్ నటిస్తున్న వారసుడు సినిమాను కూడా సంక్రాంతికే తీసుకువస్తున్నట్టు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. బాలయ్య – గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న NBK107 కూడా సంక్రాంతి బరిలోనే ఉండబోతుంది. మేకర్స్ దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా చేశారు. వీటితో పాటు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య కూడా సంక్రాంతి కే రాబోతుందని టీం అనౌన్స్ చేశారు.

సినిమాలు ఎక్కువ ఉండటంతో ఈ సారి సంక్రాంతి సమయంలో బాక్సాఫీస్ దద్దరిల్లడం ఖాయమని తెలుస్తుంది. అయితే ఈ పోరు నుంచి మెగాస్టార్ తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. వాల్తేరు వీరయ్య పనులు సంక్రాంతి వరకు పూర్తి కావడం కష్టమే అని టాక్. దీంతో సంక్రాంతి బరిలో చిరు లేకపోవచ్చు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ప్లేస్ లో ఓ యంగ్ హీరో సినిమా సంక్రాంతి పోటీలో నిలవబోతుందని తెలుస్తుంది.

- Advertisement -

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్ హీరోగా చేస్తున్న ఏజెంట్ సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. అన్ని సంక్రమంగా జరిగితే సంక్రాంతి పోటీలో అక్కినేని అఖిల్ కూడా కనిపించే అవకాశాలున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు