Nani: నాని – సిబి చక్రవర్తి కాంబో మూవీ లేనట్టేనా..కారణం..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి డైరెక్టర్ అవుదామని వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. ఈమధ్య ఆయన తెరకెక్కించిన చాలా సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయని చెప్పవచ్చు.. ఒకవైపు హీరోగా.. మరోపక్క నిర్మాత గా కూడా సక్సెస్ చవి చూస్తోన్న నాని తాజాగా వరుస సినిమాలు లైన్ అప్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా నాని నటించిన చిత్రం హాయ్ నాన్న.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ క్రమంలోనే నాని తన తదుపరి చిత్రాన్ని ఏ డైరెక్టర్ తో చేయబోతున్నారు అంటూ ఒక వార్త వైరల్ అవ్వగా.. త్వరలో నాని డాన్ ఫేమ్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. స్కంద నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ చేస్తున్నారని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావట్లేదని తెలుస్తోంది. దీనికి కారణం బడ్జెట్ అట..అసలు విషయం ఏమిటంటే..నాని- సిబి చక్రవర్తి కాంబినేషన్ మూవీ కాన్సిల్ అయ్యింది. హీరో పారితోషకం కాకుండా సినిమాకి రూ.100 కోట్ల బడ్జెట్ అవుతుంది అని దర్శకుడు చెప్పడంతో నిర్మాత శ్రీనివాస చిట్టూరి షాక్ అయ్యి నో చెప్పినట్టు తెలుస్తుంది.

ఇక అలా వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా పట్టాలెక్కక ముందే ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరొకవైపు.. ఈ సినిమా ప్రకటించడం కంటే ముందే.. అంటే సుందరానికి దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని డీ వీ వీ దానయ్య నిర్మిస్తారని సమాచారం . అయితే సెకండ్ ఆఫ్ స్టోరీ ఇంకా సెట్ కాకపోవడంతో నాని తన కొత్త ప్రాజెక్టుని టేకప్ చేసే ఆలోచనలో ఉన్నట్లు.. అందులో భాగంగానే సిబి చక్రవర్తితో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు బడ్జెట్ కారణంగా ఈ సినిమా కూడా ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా నాని అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ మిగిల్చిందని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు