Sudigali Sudheer: ఉన్నది వదిలేసి లేనిదాని కోసం ఆరాట పడుతున్న కమెడియన్..!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా క్రేజ్ సంపాదించిన సుడిగాలి సుధీర్ హీరోగా నిలదొక్కుకోవడం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. సుధీర్ హీరోగా వచ్చిన సినిమాల్లో గాలోడు మినహా అన్ని డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇప్పటిదాకా సుధీర్ చేసిన సినిమాల్లో గాలోడు, సాఫ్ట్వేర్ సుధీర్ మాత్రమే సోలోగా, కమర్షియల్ ఎంటర్టైనర్ జానర్లో చేసాడు.

మిగతావన్నీ హర్రర్, కామెడీ బ్యాక్డ్రాప్ లో వచ్చినవే. ప్రస్తుతం షోస్ కూడా మానేసి కేవలం సినిమాల మీదనే కాన్సంట్రేట్ చేసిన సుధీర్ కథలు వినే పనిలో ఉన్నాడట. అయితే, తనకు వద్దకు వస్తున్న కామెడీ, హర్రర్ కథలను రిజెక్ట్ చేస్తున్నాడట సుధీర్. మాస్, కమర్షియల్ కథలు మాత్రమే కావాలని డైరెక్టర్స్ కి చెప్తున్నాడట సుధీర్.

సుధీర్ హీరోగా నటించిన కాలింగ్ సహస్ర సినిమా కంప్లీట్ అయ్యి చాలా కాలం అవుతున్నా కానీ, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ డిలే అవ్వటానికి కారణం సుధీర్ అని తెలుస్తోంది. కాలింగ్ సహస్ర సినిమాలో హీరో సుధీర్ అయినప్పటికీ ప్రిఫరెన్స్ మొత్తం హీరోయిన్ కే షిఫ్ట్ అయ్యిందని ఇది ఇష్టం లేకే సుధీర్ రిలీజ్ ఆపుతున్నాడని సమాచారం.

- Advertisement -

మొత్తానికి మాస్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న సుధీర్ అటు కామెడీ సినిమాలు చేయక, టీవీ షోస్ కి దూరమై, ఇటు మాస్ స్టోరీస్ కోసం ఎదురు చూస్తూ కెరీర్లో ప్రైమ్ టైమ్ ని వేస్ట్ చేసుకుంటున్నాడు. మాస్ కథలు రాసుకున్న రైటర్స్, డైరెక్టర్స్ స్టార్ హీరోలు, మాస్ ఇమేజ్ ఉన్న హీరోలకు ప్రయారిటీ ఇస్తారు కానీ, కామెడీ ఇమేజ్ ఉన్న సుధీర్ కోసం ఎందుకు వస్తారని కామెంట్స్ వస్తున్నాయి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు