SIIMA awards Telugu 2023: సైమా అవార్డ్స్ తెలుగు – ఎవరెవరికి ఏం అవార్డ్స్ వచ్చాయంటే ?

SIIMA awards Telugu 2023

ప్రతి ఏటా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక సెప్టెంబర్ 15, 16 తేదీలలో జరుగుతుందనే విషయం అందరికి తెలిసిందే. దుబాయ్ వేదికగా నిన్న మొదలైన ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఈవెంట్ లో మొదటి రోజు తెలుగు, కన్నడ సినిమాలకు సంబందించిన నటీనటులకు మరియు టెక్నీషియన్స్ కు అవార్డ్స్ ప్రధానం చేయడం జరిగింది.

ఇక అవార్డ్స్ విషయానికొస్తే తెలుగు ప్రేక్షకులు ముందు నుంచి ఆశించినట్టుగానే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఎన్టీఆర్‌కు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ‘ధమాకా’ చిత్రానికి గానూ శ్రీలీలకు బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ చిత్రంగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో వచ్చిన సీతారామం సినిమాకు వచ్చింది. ఇక ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు. ఉత్తమ సహాయ నటుడిగా రానా (భీమ్లా నాయక్‌), ఉత్తమ సహాయ నటిగా సంగీత (మసూద)కు అవార్డులు వరించాయి.

సైమా అవార్డ్స్‌ -2023 విజేతలు..
ఉత్తమ నటుడు : ఎన్టీఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం)
ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)
ఉత్తమ సహాయ నటుడు : రానా (భీమ్లానాయక్‌)
ఉత్తమ దర్శకుడు : ఎస్‌ఎస్‌ రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ చిత్రం : సీతారామం (వైజయంతీ మూవీస్‌, స్వప్న మూవీస్‌)
ఉత్తమ సహాయ నటి : సంగీత (మసూద)
ఉత్తమ పరిచయ నటి : మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఎంఎం కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ సినిమాటోగ్రఫీ : కె.కె సెంథిల్‌ కుమార్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)
ఉత్తమ గేయ రచయిత : చంద్రబోస్‌ (నాటు నాటు- ఆర్‌ఆర్‌ఆర్)
ఉత్తమ నేపథ్య గాయకుడు : రామ్‌ మిరియాల (డీజే టిల్లు)
ఉత్తమ విలన్‌ : సుహాస్‌ (హిట్‌ 2)
ఉత్తమ పరిచయ దర్శకుడు : మల్లిడి వశిష్ట (బింబిసార)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌) : అడవి శేష్‌ (మేజర్‌)
ఉత్తమ నటి (క్రిటిక్స్‌) : మృణాల్‌ ఠాకూర్‌ (సీతారామం)
ఉత్తమ హాస్య నటుడు : శ్రీనివాస్‌ రెడ్డి (కార్తికేయ 2)
ఉత్తమ పరిచయ నిర్మాత (తెలుగు) : శరత్‌, అనురాగ్‌ (మేజర్‌)
ఉత్తమ నేపథ్య గాయని: మంగ్లీ (జింతాక్ – ధమాకా)
ఉత్తమ డెబ్యూ హీరో: అశోక్ గల్లా (హీరో)
ప్రామిసింగ్ డెబ్యూ నటుడు : గణేష్ బెల్లంకొండ
ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ యూత్ ఐకాన్ : శృతి హాసన్

- Advertisement -

మొత్తంగా చూస్తే ఎక్కువ అవార్డ్స్ ఈ ఏడాది ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమానే వరించాయని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు