Sandeep Reddy Vanga: దానికోసం 36 ఎకరాలు అమ్ముకున్న యానిమల్ డైరెక్టర్.. ఏమైందంటే.?

టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు పొందిన అతి తక్కువ మంది డైరెక్టర్లలో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఒకరు.. గతంలో పలు సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించిన సందీప్ రెడ్డి వంగా.. డైరెక్టర్ గా మారాలనుకున్న సమయంలో ఎంతోమంది హీరోలు ఆఫీసుల చుట్టూ తిరిగే వారట.. అయితే చివరికి హీరో విజయ్ దేవరకొండ తనకి అవకాశం ఇవ్వడంతో అర్జున్ రెడ్డి సినిమాతో తన టాలెంట్ ని చూపించారు. ఈ సినిమా బడ్జెట్ కేవలం 5 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు.

పెళ్లిచూపులు సినిమాతో హిట్ కొట్టినప్పటికీ విజయ్ దేవరకొండకు పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు. దీంతో రెమ్యూనరేషన్ కూడా రూ.50 లక్షల లోపే ఉందని.. హీరోయిన్ కూడా కొత్త అమ్మాయి కావడంతో బడ్జెట్లో అధిక భాగం మేకింగ్ కి ఖర్చు చేసినట్లు సమాచారం.. అయితే ఈ చిత్రానికి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ పైన ప్రణయ్ రెడ్డి వంగ ఈ సినిమాని నిర్మించడం జరిగిందట.

అయితే ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టడం కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తనకు ఉన్న 36 ఎకరాల మామిడి తోటను కూడా అమ్మేసినట్లు సమాచారం. దీంతో 1.5 కోట్ల రూపాయలతో అప్పు చేసి ప్రామిసరీ  నోటు కింద అర్జున్ రెడ్డి మూవీని చేశారట. ఈ విషయాలన్నీ ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ తెలియజేయడం జరిగింది.. ఒకరకంగా అర్జున్ రెడ్డి సినిమా లేకపోతే తాను కూడా రోడ్డున పడాల్సి వచ్చేదంటూ కూడా ఇన్ డైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు చెప్పవచ్చు. ఇలా తన మామిడి తోటను అమ్మి డైరెక్టర్ గా మారారు సందీప్ రెడ్డి.

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాకి పెట్టుబడి పెట్టి.. పదింతల లాభం వరకు వచ్చిందట.. దాదాపుగా రూ.50 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి భారీ విజయాన్ని అందించింది. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఇటీవలే యానిమల్ సినిమాతో రూ.600 కోట్లు మార్క్ ని అందుకోవడం జరిగింది డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఈ చిత్రంలో కూడా నిర్మాణ భాగస్వామి గా ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు