Mehreen Pirzada: దుఃఖం లో మెహ్రిన్.. అదే కారణమా..?

హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు, ఎమ్మెల్యే భవ్య బిష్ణోయ్.. అందరికీ సుపరిచితమే.. మరో కొద్ది రోజుల్లో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఈనెల 22వ తేదీన.. IAS పరి బిష్ణోయ్ ను భవ్య వివాహం చేసుకోబోతున్నారు. దాదాపుగా ఈ వేడుకకు మూడు లక్షల మందికి పైగా జనం హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అత్యంత గ్రాండ్ వెడ్డింగ్ లలో ఈ పెళ్లి కూడా ఒకటిగా నిలవబోతోంది.. ఇక వీరి వివాహం తర్వాత ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ ఇతరత్రా ప్రాంతాలలో కూడా వీరి రిసెప్షన్ చాలా గ్రాండ్గా జరగబోతోంది అని సమాచారం.

ఈ వేడుకకు పలువురు సీనియర్ నేతలు కూడా రాబోతున్నట్లు సమాచారం. వీరి వివాహ వేడుకకు హిసార్ లోని అదంపూర్ లో ఉన్నటువంటి 55 గ్రామాల ప్రజలను కూడా ఆహ్వానించినట్లు సమాచారం . ఇక తన తండ్రి అడుగుజాడలలో అనుసరిస్తూ భవ్య బిష్ణోయ్ వివాహానికి సంబంధించి ఆహ్వానాలను పంపిస్తున్నట్లుగా తెలుస్తోంది.. అదంపూర్ ఎమ్మెల్యేగా పేరుపొందిన భవ్య బిష్ణోయ్ ఐఏఎస్ పరి బిష్ణోయ్ ను ప్రేమించి వివాహం చేసుకున్నట్లుగా తెలుస్తోంది . ఈ ఏడాది వీరి ఎంగేజ్మెంట్ ఏప్రిల్ నెలలో చాలా గ్రాండ్గా జరిగిందట.

ఈనెల 22వ తేదీన రాజస్థాన్లోని ఉదయపూర్ లో చాలా గ్రాండ్గా వీరి వివాహం జరగబోతోంది.. ఆ తర్వాత డిసెంబర్ 24న రాజస్థాన్లో పుష్కర్ లో మొదటి రిసెప్షన్ జరగబోతోంది. ఆ తర్వాత రెండో రిసెప్షన్ ఈనెల 26వ తేదీన హర్యానాలో జరగబోతోందట. అయితే ఇది భవ్య బిష్ణోయ్ కుటుంబానికి ఒక బలమైన కోటగా పిలువబడిందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉన్నారు. దీంతో కార్యకర్తలు ఆయన అభిమానులు దాదాపుగా లక్ష మందికి పైగా అతిథులు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

- Advertisement -

డిసెంబర్ 27న ఢిల్లీలో చివరిగా రిసెప్షన్ జరుగుతోంది ఇందులో పలువురు రాజకీయ నాయకులు సైతం పాల్గొనబోతున్నారు. ఇదిలా ఉండగా ఈ విషయం తెలిసి ప్రముఖ హీరోయిన్ మెహ్రీన్ దుఃఖిస్తున్నారని సమాచారం. భవ్య బిష్ణోయ్ గతంలో టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ తో 2021 లో నిశ్చితార్థం జైపూర్లో చాలా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఎంగేజ్మెంట్ అయిన కొద్ది రోజులకి వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వివాహాన్ని సైతం క్యాన్సిల్ చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆ తర్వాత ఇద్దరు కూడా తమ వ్యక్తిగత జీవితాలతో చాలా బిజీగా మారిపోయారు.. మెహ్రీన్ ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలలో నటించింది. 2022లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్ లో బిజెపి తరఫున పోటీ చేసిన భవ్య బిష్ణోయ్ హర్యానా ఎమ్మెల్యేగా గెలిచారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు