Tillu Square: సిద్దు సినిమాలో సమంత డౌటేనా..?

ఈ ఏడాది శాకుంతలం ద్వారా డిజాస్టర్ అందుకున్న సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తోంది. దీంతో పాటుగా సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్ లో కూడా నటిస్తోంది. ఈ మధ్య లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్న సమంత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. ఈ క్రమంలో నందిని రెడ్డి డైరెక్షన్లో సిద్దూ హీరోగా రానున్న సినిమాలో సమంత నటిస్తోందని వార్తలొచ్చాయి. అంతే కాకుండా, ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన, సిద్దు జొన్నలగడ్డ కాంబినేషన్లో రానున్న సినిమాలో కూడా సమంతానే హీరోయిన్ అని వార్తలొచ్చాయి.

వీటిపై అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ, సమంతకి నందిని రెడ్డి, నీరజ కోనతో ఉన్న రిలేషన్ కారణంగా ఈ సినిమాలు యాక్సెప్ట్ చేసి ఉండచ్చని అంటున్నారు.ప్రస్తుతం భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్న సమంత సిద్దు చేయనున్న సినిమాల్లో ఏదో ఒకదానిని నుండి తప్పుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత లైనప్ లో ఖుషి మినహా తెలుగు సినిమాలేవీ లేవు కాబట్టి ఈ వార్తలు నిజమేనన్న సంకేతాలు వస్తున్నాయి.

శాకుంతలం ద్వారా డిజాస్టర్ అందుకున్న సమంతకి ఖుషి సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. సెప్టెంబర్ 1న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని లిరికల్ సాంగ్ బ్లాక్ బస్టర్ అవ్వటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి, డిజాస్టర్ తర్వాత వస్తున్న ఖుషి సినిమా సమంతకి హిట్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు