Virata Parvam: పెళ్లికాకముందే సాయి పల్లవి ప్రెగ్నెంట్ ?

టాలీవుడ్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కథానాయకల్లో సాయి పల్లవి రూటే సపరేటు. ఈ బ్యూటీ గ్లామర్ ట్రీట్ చేయకపోయినా కుర్రాళ్లు ఫిదా అవుతుంటారు. తెరపై ఈ భామ కనిపిస్తే చాలు మనసుకు ఏదో తెలియని హాయి. టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఈ అమ్మడు దూసుకెళ్తోంది. ఇటీవలే సాయి పల్లవి రాణాతో కలిసి విరాటపర్వంలో కనిపించింది.

2005లో వచ్చిన కస్తూరి మాన్ అనే తమిళ్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది సాయి పల్లవి. ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో నటించింది. ఆ తర్వాత 2015లో వచ్చిన ప్రేమమ్ అనే మలయాళం సినిమాతో సాయి పల్లవికి మంచి గుర్తింపు వచ్చింది.

ఇదిలా ఉంటే… సాయి పల్లవి ప్రెగ్నెంట్ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం… “సాయి పల్లవి చీర కట్టుకొని వంట చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆ చీరలో సాయి పల్లవి నిండుగా ఉండటంతో పాటు ప్రెగ్నెంట్ లా కనిపిస్తుంది” ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో…”ఏంటి సాయి పల్లవి ప్రెగ్నెంటా” అంటూ కొందరు నెటిజన్లు షాక్ అవుతుంటే… మరికొందరు మాత్రం “ఇదేదో మూవీ షూట్ అయి ఉంటుంది… క్యూట్ లుక్” అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updatesGossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు