Raviteja : సెంటిమెంట్ కలిసొస్తుందా ?

మెగాస్టార్‌చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆయ‌న న‌టించిన తాజా చిత్రం గాడ్ ఫాద‌ర్ స‌క్సెస్‌ను చిరంజీవితో పాటు ఆయ‌న అభిమానులు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రం విజ‌యం సాధించ‌డంతో గాడ్‌ఫాద‌ర్ టీమ్ వ‌రుస ఇంట‌ర్వ్యూల‌ను ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతుంది. చిరంజీవి చేస్తున్న సినిమాల‌కు సంబంధించి ఏదో ఒక అప్‌డేట్ ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో వినిపిస్తూనే ఉంటుంది.

మెగాస్టార్ నటిస్తున్న చిత్రాల్లో 154 ఒక‌టి. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ ప‌నులు షురూ అయిన‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే చిత్రం నుంచి ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ఇందులో ర‌వితేజ పాత్ర‌కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మై అప్‌డేట్ ఒక‌టి బ‌య‌టికి వ‌చ్చింది. మాస్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ, వైజాగ్ రంగ‌రాజు అనే మాస్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నాడ‌ని టాలీవుడ్ స‌ర్కిల్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో చిరంజీవి వాల్తేరు వీర‌య్య‌గా, అత‌ని సోద‌రుడి పాత్ర‌లో ర‌వితేజ క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. ఈ అప్‌డేట్ పై అధికారికంగా ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ వార్త‌ను చిరంజీవి, ర‌వితేజ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శృతి హాస‌న్ ఫీమేల్ లీడ్ రోల్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. ర‌వితేజ న‌టించిన విక్ర‌మార్కుడు సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అందులో ర‌వితేజ ప‌వ‌ర్ పుల్ పోలీస్ పాత్ర‌లో క‌నిపించారు. అదేవిధంగా ఇటీవ‌ల ర‌వితేజ క్రాక్ సినిమాలో పోలీస్ పాత్ర‌లో ఒదిగిపోయాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇప్పుడు తాజాగా చిరంజీవి సినిమాలో కూడా పోలీస్ పాత్ర‌లో న‌టిస్తుండ‌డంతో ఈ సినిమా క‌లిసొస్తుందో లేదో చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు