Animal: యానిమల్ ఎఫెక్ట్..ఇకపై రష్మిక అలా మారనుందా ?

రష్మిక మందన్న.. ఓవైపు దక్షిణాది, తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉంటూనే మరోవైపు బాలీవుడ్, పాన్ ఇండియా చిత్రాల్లోనూ నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ శాండిల్ వుడ్ బ్యూటీ అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తుంది. ఇటీవల యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తన నటనతో మంచి మార్కులు వేయించుకుంది. అలాగే బాలీవుడ్ లో బడా హీరోయిన్ల లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది.

ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో రష్మీకకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబు కోసం ఐటమ్ సాంగ్ చేసేందుకు సిద్ధమైందట. ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కలయికలో హైట్రిక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ గుంటూరు కారం మూవీలో రష్మిక ఐటమ్ బ్యూటీగా అలరించనుంది.

అదేంటి స్టార్ హీరోయిన్ గా ఉండి.. ఈ సమయంలో ఐటెం సాంగ్ చేయడం ఏంటనే సందేహం రాక మానదు. కానీ రష్మిక ఓకే చెప్పిందనే వార్తలే బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ మధ్యలో శ్రీలీల, మీనాక్షి చౌదరి సైతం చిందులు వేయబోతున్నారట. ఇక ఈ ఐటెం సాంగ్ చేయడానికి రష్మికకు మేకర్స్ నుంచి మంచి రిమ్యునరేషనే ఇస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాలో గ్లామర్ టచ్ గట్టిగానే ఇస్తున్నాడని చెప్పొచ్చు.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు