Nagarjuna : మ‌రోసారి నాగార్జున ఆ అవ‌తారం ఎత్త‌బోత్తున్నారా?

కోలీవుడ్ వెర్సటైల్ హీరో ధనుష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. ఆయన తమిళ సినిమాలు తెలుగులో అనువాదం కావడమే కాదు.. మంచి విజయాలు కూడా సాధించాయి. ఇప్పుడు ఆయన తెలుగు దర్శకులతో కూడా పనిచేయడానికి అమితాసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేశారు. ఇదే కాకుండా ధనుష్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమాని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాని ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఓ టాలీవుడ్ స్టార్ హీరో మాఫియా డాన్ పాత్రలో కనిపించనున్నారట. ఆ హీరో మరెవరో కాదు అక్కినేని నాగార్జున. ఈ చిత్రంలో నాగార్జున పాత్ర ఒకానొక దశలో ధనుష్ కి పోటీగా ఉండే పాజిటివ్ రోల్ అని ప్రచారం జరిగింది. ధనుష్ హీరో అయితే నాగార్జున కాస్త నెగిటివ్ షేడ్స్ ఉండే రోల్ చేస్తున్నట్లు ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఇటీవలే ఇది ముంబై మాఫియా స్టోరీ అని రివ్యూ కావడంతో.. నాగార్జున పాత్రని ఆ రెండు పాత్రల కంటే భిన్నంగా, చాలెంజింగ్ గా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏకంగా ముంబై మాఫియానే శాసించే డాన్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి డాన్ పాత్ర పోషించడం నాగార్జునకు కొత్తేం కాదు.. కానీ ఈ రోల్ వైవిధ్యత ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక ఏషియన్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ సినిమా సెక్స్ పైకి వెళ్ళనుందని తెలుస్తుంది.

- Advertisement -

 

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు