Project K: ప్లానింగ్ అదుర్స్ – ప్రమోషన్స్ నిల్…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో  ‘ప్రాజెక్ట్ కె’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ లో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో నెలకొన్నాయి. చాలా కాలం కిందట షూటింగ్ ప్రారంభమై దాదాపు 80శాతం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవటంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ నటించనున్నాడన్న అప్డేట్ రావటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మొదట్లో 500కోట్ల బడ్జెట్ అంచనాతో ప్రారంభమైన ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు 600కోట్లు దాటిందని సమాచారం అందుతోంది. పాన్ వరల్డ్ లెవెల్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు ప్రమోషన్స్ చాలా కీలకం, అలాంటిది 2024 సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయకపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

పాన్ ఇండియా సినిమాలకే కనీసం 40 రోజుల ముందు నుండి ప్రమోషన్స్ చేస్తున్న పరిస్థితిలో ఈ పాన్ వరల్డ్ సినిమాకి అంతకు రెట్టింపు సమయం అవసరం ఉంటుంది. మోస్ట్ అవైటెడ్ సినిమాగా ఉన్న ప్రాజెక్ట్ కె కి కనీసం ఆరు నెలల ముందు నుండే వరల్డ్ వైడ్ క్యాంపైన్ రన్ చేస్తే గానీ పాన్ వరల్డ్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవటం కూడా ఒక రకంగా ప్రాజెక్ట్ కె సినిమా యూనిట్ కి ఆందోళన కలిగించే అంశం అని చెప్పవచ్చు.

600కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె రెమ్యునరేషన్ 10కోట్లు అని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ రెమ్యునరేషన్ సుమారు 150కోట్లు ఉండచ్చని అంటున్నారు. మొత్తానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కే 200కోట్ల వరకు ఖర్చు కాగా సినిమా మేకింగ్ కి 400కోట్లకు పైగా ఖర్చయ్యే అవకాశం ఉంది. మరి, బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ లేని ప్రభాస్ కి ప్రాజెక్ట్ కె ద్వారా అయినా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు