Hari Hara Veera Mallu : కొత్త డేట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ప‌వ‌న్ ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే మ‌రోవైపు రాజ‌కీయాల్లో రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమాల‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇటీవ‌లే హ‌రిహ‌ర‌వీర మ‌ల్లు సినిమా షూటింగ్‌లో పాల్గొని సంద‌డి చేసిన విషయం తెలిసిందే. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీగా ఉండ‌డం వ‌ల్ల సినిమా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన డేట్స్ పవ‌న్ క‌ళ్యాణ్ అడ్జ‌స్ట్ చేసిన‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే నెల ఫ‌స్ట్ వీక్ వ‌ర‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్ హ‌రి హ‌ర‌వీర‌మ‌ల్లు సినిమాకి డేట్స్ కేటాయించిన‌ట్టు స‌మాచారం. ఈ డేట్స్ లోప‌లే ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోర్ష‌న్‌కి సంబంధించిన షూటింగ్ పూర్తి చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ఇది తొలి పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ సినిమాపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు.

మ‌రోవైపు ఈ సినిమాకి సంబంధించి విడుద‌ల అయ్యే తేదీ ఫిక్స్ అయింద‌ని ఓ టాక్ వినిపిస్తోంది. వ‌చ్చే ఏడాది అన‌గా 2023 మే 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు మూవీ మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. భారీ బ‌డ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం విదేశీ నిపుణులు ప‌ని చేస్తున్నార‌ట‌. అనుకున్న‌ట్టు ఈ సినిమా మే 12న విడుద‌ల‌వుతుందా..? అంత‌క‌న్న ముందే విడుద‌ల‌వుతుందా వేచి చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు