NTR’s Devara: అమిత్ షాను కలవనున్న తారక్..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలవనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఈ భేటీ వెనక కారణం ఏంటన్నది తెలీదు కానీ, తెలంగాణ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న తరుణంలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనా లేక దీని వెనక రాజకీయ కోణం ఏదైనా ఉందా అన్నది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం గోవా వెళ్ళాడు. గోవా నుండి ఒకటి రెండు రోజుల్లో హైదరాబాద్ చేరుకొని అమిత్ షాను కలుస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలకే పరిమితమైన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ వార్తల్లో నిజమెంతో తెలీదు కానీ, అటు రాజకీయ వర్గాల్లో, ఇటు సినీ వర్గాల్లో ఆసక్తి పెంచింది. ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావటంతో దేవర కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అటు డైరెక్టర్ కొరటాల శివకి కూడా ఈ సినిమా హిట్ అవ్వటం చాలా కీలకం అని చెప్పాలి. ఆచార్య సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకోవటమే కాకుండా తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాతో హిట్ ఎలా అయినా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడట కొరటాల. మరి, కొరటాలకి బ్లాక్ బస్టర్ తప్పనిసరైన పరిస్థితిలో వస్తున్న ఈ సినిమా ఏ మేరకు అలరిస్తుంది అన్నది వేచి చూడాలి.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు