Prabhas: ఆదిపురుష్ ని ఆ సినిమాతో కంపేర్ చేస్తున్న నార్త్ ఆడియెన్స్..!

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలైన సంగతి తెలిసిందే. మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం భారీగా వచ్చాయి. తొలిరోజు 140కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఆదిపురుష్ ప్రభాస్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ లిబర్టీపై, వీఎఫెక్స్ పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఆదిపురుష్ వీఎఫెక్స్ ని బ్రహ్మాస్త్ర సినిమా వీఎఫెక్స్ తో కంపేర్ చేస్తున్నారు నార్త్ ఆడియెన్స్. ఆదిపురుష్ వీఎఫెక్స్ కంటే బ్రహ్మాస్త్ర సినిమాలోని వీఎఫెక్స్ క్వాలిటీ బాగుందని కామెంట్ చేస్తున్నారు.

500కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో వీఎఫెక్స్ నాసిరకంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. కేవలం వీఎఫెక్స్ విహయాంలోనే కాకుండా ఈ సినిమాలో హనుమంతుడి డైలాగ్స్ విషయంలో కూడా వివాదం నెలకొంది. హనుమంతుడి పాత్రతో అలాంటి డైలాగ్స్ చెప్పించి రామాయణాన్ని అవమానించారని కూడా విమర్శలు వస్తున్నాయి.

మొత్తానికి ఆదిపురుష్ సినిమాకి ట్రైలర్ తో వచ్చిన హైప్ అంతా మొదటిరోజే మాయమైందని చెప్పాలి. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కి బ్రేకివెన్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి తొలి ఆట నుండే మిశ్రమ స్పందన సొంతం చేసుకున్న ఈ సినిమా 1000కోట్ల టార్గెట్ ని రీచ్ అవుతుందా లేదా అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే కొంతకాలం వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు