NBK107: పరిశీలన మరొకటి

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది. సినిమాలు సగానికి పైగా షూటింగ్ పూర్తి అయినా, టైటిల్ ను రివీల్ చేయడం లేదు. కొంత మంది టైటిల్ ను రివీల్ చేయడం లేదు. మరి కొంత మంది అసలు టైటిల్ ను ఫిక్స్ చేయకుండానే షూటింగ్ ను పూర్తి కానిస్తున్నారు. రామ్ చరణ్ – శంకర్ కాంబోలో వస్తున్న సినిమా దాదాపు 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి అయింది. ఇంకా టైటిల్ ను రివీల్ చేయడం లేదు. RC15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ జరుపుకుంటున్నారు. దీంతో పాటు NBK107, Mega154 లాంటి సినిమాలు ఇదే ఫాలో అవుతున్నాయి.

Mega154 సినిమా టైటిల్ ‘వాల్తేరు వీరయ్య’ అని చిరంజీవి ఒక సందర్భంలో చెప్పాడు. కానీ దీనిపై ఫుల్ క్లారిటీ మాత్రం లేదు. అలాగే NBK107 సినిమాను గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి అయినట్టు సమాచారం. ఇప్పటి వరకు టైటిల్ ను రివీల్ చేయలేదు. కాదు.. కాదు.. అసలు టైటిల్ నే ఫిక్స్ చేయలేదు.

రెండు నుంచి మూడు టైటిల్స్ ను మేకర్స్ రెడీ గా ఉంచారట. వాటిని బాలయ్య ముందుకు కూడా తీసుకెళ్లారట. కానీ, దానిపై ఏది ఫైనల్ చేయాలని మాత్రం డిసైడ్ కాలేదని తెలుస్తుంది. వీటిలో ‘జై బాలయ్య’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయినట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో టైటిల్ వినిపిస్తుంది. NBK107 కు ‘రెడ్డి గారు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు టాక్. కానీ, ‘జై బాలయ్య’ అంటే మాస్ ఆడియన్స్ కి, నందమూరి అభిమానులకు రీచ్ అవుతుందని డైరెక్టర్ గోపీచంద్ ఆలోచన. మరి వీటిలో ఏది ఫిక్స్ చేస్తారో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు