Naga Chaitanya: లగ్జరీ కోసం కోట్లు ఖర్చుపెట్టిన అక్కినేని వారసుడు ?

అక్కినేని నాగచైతన్య.. థాంక్యూ మూవీ ఫెయిల్ తర్వాత తన తర్వాత సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ఈ సినిమా మే 12న విడుదల కానుంది. అందుకే మూవీ టీం ఇప్పటి నుంచే సన్నహాకాలు చేస్తుంది. కాగా ప్రస్తుతం నాగచైతన్య వరుసగా సినిమాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా నాగచైతన్యకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.

ఇటీవల ఉగాది సందర్భంగా నాగచైతన్య కొత్త ఇల్లు కొనడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాగార్జున ఇంటికి దగ్గరలోనే ఓ స్థలం కొన్న నాగచైతన్య తన అభివృద్ధికి తగ్గట్టుగానే ఇంటిని డిజైన్ చేయించుకున్నారట. దీంతో హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో కొత్త ఇంటి యజమానిగా మారాడు నాగచైతన్య. తన కొత్త అపార్ట్మెంట్ ను అత్యంత విలాసవంతమైన అలాగే సౌకర్యవంతమైనదిగా మార్చుకోవడానికి నాగచైతన్య భారీగానే ఖర్చు చేసినట్లు సమాచారం అందుతోంది.

నాగచైతన్య… తన కొత్త ఇంటి కోసం ఏకంగా 15 కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కొత్తగా కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ లోని ప్రతి అంగుళం కూడా తన సొంత అభివృద్ధితో లగ్జరీగా డిజైన్ చేయించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఈ విషయమే టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. అయితే, గత కొన్ని రోజుల క్రితం ఈ ఇల్లు గురించి మరో రకంగా వార్తలు వచ్చాయి. ముందుగా ఈ ఇల్లును నాగ చైతన్య, సమంత కలిసి ఉండటానికి ప్లాన్ చేసుకున్నారట.

- Advertisement -

దాని కోసం సమంత కూడా కొన్ని డిజైన్లు చేయించిందని టాక్ వచ్చింది. కానీ, వీరు అనూహ్యంగా డైవర్స్ తీసుకోవడంతో, ఆ ఇల్లు నిర్మాణ పనులు వాయిదా పడ్డాయట. తర్వాత నాగ చైతన్య తన టెస్ట్ కు తగినట్టు మార్చుకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు