Mr Bachchan : ఈసారికి బిగ్ బీని నమ్ముకుంటున్న రవితేజ… ప్లస్ అవుతుందా?

మాస్ మహారాజా రవితేజ హిట్ కోసం బిగ్ బీనీ నమ్ముకుంటున్నాడు. మరి హిట్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరోకు బచ్చన్ ప్లస్ అవుతాడా? ఈ హీరోకు “మిస్టర్ బచ్చన్” సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అంటే…

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో ఓ కొత్త మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. గతంలో ఈ కాంబోలో షాక్, మిరపకాయ్ వంటి చిత్రాలు వచ్చాయి. ఆ తర్వాత దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తీసుకున్న హరీష్, రవితేజ మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ మూవీలో రవితేజతో భాగ్యశ్రీ బోర్సే రొమాన్స్ చేయబోతోంది. ఈ బ్యూటీకి తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ. ఇక మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ “రైడ్” మూవీకి రీమేక్ గా రవితేజ మూవీ రాబోతోంది. ఈ లేటెస్ట్ మూవీకి “మిస్టర్ బచ్చన్” అనే టైటిల్ ను ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ ను వదిలారు మేకర్స్. అందులో పాతకాలంనాటి స్కూటర్ పై స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు రవితేజ. ఆయన వెనకాలే అమితాబ్ బచ్చన్ పోస్టర్ కనిపిస్తుండడం విశేషం.

అంతేకాకుండా “మిస్టర్ బచ్చన్” టైటిల్ కింద నామ్ తో సునా హోగా అనే క్యాప్షన్ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అమితాబ్ బచ్చన్ పాపులర్ బాలీవుడ్ మూవీ డైలాగ్ ను రవితేజ ఇలా ఉపయోగించుకోవడం ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా రవితేజ ట్విట్టర్లో “మిస్టర్ బచ్చన్” పోస్టర్ ను పంచుకుంటూ తన అభిమాన నటుడు అమితాబ్ బచ్చన్ పేరుతో సినిమా చేయడం గౌరవంగా భావిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో కూడా రవితేజ తన సినిమాలకు సంబంధించిన పనులు వేడుకల్లో తాను బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు వీరాభిమానినని వెల్లడించిన విషయం తెలిసిందే. డాన్ శీను తో పాటు మరికొన్ని సినిమాల్లో ఆయన ఏకంగా అమితాబ్ ను ఇమిటేట్ చేసి అలరించాడు. ఇక ఇప్పుడు మాస్ మహారాజా తన సినిమాకు ఆయన పేరును ఉపయోగించుకొని అమితాబ్ పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చాటుకున్నాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ, మరి ఈసారి రవితేజకు అమితాబ్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అనే అనుమానం తలెత్తుతోంది

- Advertisement -

దీనికి కారణం ఆయన గత సినిమాలు వరుసగా డిజాస్టర్ పాలవ్వడమే. “ధమాకా” తర్వాత ఈ హీరో కెరీర్ లో హిట్ అనేది లేకుండా పోయింది. రీసెంట్ గా వచ్చిన రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ “టైగర్ నాగేశ్వరరావు” రవితేజను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆయన తన నెక్స్ట్ మూవీపై కాన్సెంట్రేట్ చేసాడు. అయితే ఆయన వరుసగా ప్లాప్ లను ఎదుర్కొంటూ ఉండడంతో ఈ హీరో మార్కెట్ దెబ్బతింది. దీంతో ఈ హీరోతో భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి పలువురు బడా నిర్మాతలు వెనకడుగు వేశారు. ఆయన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని రెమ్యునరేషన్ తగ్గించుకోమని కోరారు. అయితే రవితేజ మాత్రం పారితోషకాన్ని తగ్గించుకోవడానికి సుముఖంగా లేడని, అందుకే ఆయన చేయాల్సిన కొన్ని సినిమాలు హోల్డ్ లో పడ్డాయని ప్రచారం జరిగింది. ఇక ఎట్టకేలకు హరీష్- రవితేజ కాంబోలో “మిస్టర్ బచ్చన్” ఫైనలైజ్ అయింది. మరి అమితాబ్ ను వాడుకుంటున్న రవితేజకు ఈసారైనా హిట్ పడుతుందా? అనేది చూడాలి. లేదంటే ఆయన కెరీర్ ప్రమాదంలో పడ్డట్టే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు