Manchu Vishnu : కాంబో కుదిరేనా ?

టాలీవుడ్ న‌టుడు మంచు విష్ణు ఇటీవ‌ల జిన్నా సినిమాతో వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను నిరాశ ప‌రిచిన విష‌యం విధిత‌మే. తాజాగా ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్‌, ద‌ర్శ‌కుడు ప్ర‌భుదేవా ‘మా’ అధ్య‌క్షుడు మంచు విష్ణుతో ఓ ప్రాజెక్ట్ ని చేయాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుదేవా మ‌న‌సులో ఓ స్క్రిప్ట్ ఉంద‌ని.. ఆ క‌థ మంచు విష్ణుకి అయితే బాగా సూట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాడు. మ‌రోవైపు జిన్నా సినిమాలో ఒక సాంగ్‌కి ప్ర‌భుదేవా కొరియోగ్రాఫ‌ర్ గా వ్య‌వ‌హ‌రించారు.

ఈ సినిమాపై ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. మంచు విష్ణు ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో మంచి స‌క్సెస్ సాధించే సినిమా చాలా అవ‌స‌రం. ఈ మ‌ధ్య కాలంలో విష్ణు న‌టించిన సినిమాల‌న్నీ నిరాశ‌ప‌రుస్తుండ‌డంతో స‌క్సెస్ సాధిస్తే అభిమానులు ఆద‌రిస్తారు. లేకుంటే భ‌విష్య‌త్ లో మంచు విష్ణు మంచి సినిమాలు తీసినా ప్రేక్ష‌కులు వీక్షించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. కేవ‌లం మంచు విష్ణు ప‌రిస్థితే కాదు.. ప్ర‌భుదేవా ప‌రిస్థితి కూడా అదే. బాలీవుడ్ లో ఇటీవ‌ల తీసిన సినిమాల‌న్నీ కూడా డిజాస్ట‌ర్‌లుగానే మిగిలాయి.

ఇటీవ‌ల విష్ణు త‌న వ‌ద్ద చాలా ప్రాజెక్టులు ఉన్నాయ‌ని.. వాటిని త్వ‌ర‌లోనే తీయ‌బోతున్నామ‌ని చెప్పాడు. అవి ఫైన‌ల్ అయిన త‌రువాత‌నే అధికారికంగా వాటి గురించి వెల్ల‌డిస్తాన‌ని కూడా చెప్పారు మంచు విష్ణు. ఆ ప్రాజెక్టుల్లో ఒక దానికి ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తారా.. లేక ప్ర‌భుదేవా వ‌ద్ద ఉన్న క‌థ‌తో విష్ణుతో సినిమా తీస్తారా అనేది తెలియాల్సి ఉంది. భ‌విష్య‌త్ లో మంచు విష్ణు, ప్ర‌భుదేవాలు క‌లిసి ఏదైనా ప్రాజెక్ట్ చేస్తారో లేదో వేచి చూడాలి.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు