Chiranjeevi : ఆ యంగ్ హీరోనే కావాలి ?

మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య సినిమా పీడకలను మిగిల్చిన సంగతి తెలిసిందే. దీని తర్వాత వరుసగా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తున్నాడు. చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ పూర్తి కాగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ భోళా శంకర్ ను గాడిలో పెట్టేందుకు చిరు సిద్ధమైనట్లు సమాచారం. కానీ భోళా శంకర్ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. ఈ సినిమా వాయిదా పడడానికి చాలా పెద్ద కారణాలే ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

చిరంజీవి సింగిల్ గా సినిమాలు చేయడం ఎప్పటి నుంచో మానేశారు. చిరంజీవి రీఎంట్రీ అనంతరం ప్రతి సినిమాలో మరొక హీరో ఉంటున్నారు. ఆచార్యలో రామ్ చరణ్, గాడ్ ఫాదర్ లో సల్మాన్, వాల్తేరు వీరయ్య కు రవితేజను ఎంపిక చేశారు. ఇప్పుడు భోళా శంకర్ సినిమాకు కూడా మరో యంగ్ హీరో తోడు కావాలి. ఆ హీరో ఎవరనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. హీరో నితిన్ ను ఈ సినిమాలో చేర్చుకునేందుకు చిత్ర బృందం సంప్రదింపులు చేసిందట.

నితిన్ ఈ ప్రాజెక్టుకు ఓకే చెప్పాడా లేక నో చెప్పాడా అనేది తెలియ రాలేదు. మొత్తానికి సస్పెన్స్ లో ఉంది. ఒకవేళ నితిన్ కాదంటే ఆ రేంజ్ యంగ్ హీరోను తీసుకోవాలి. కానీ మెగాస్టార్ మాత్రం తనకు జోడిగా నితిన్ మాత్రమే కావాలని మొండి చేసి కూర్చున్నారట. ఎవరైనా మెగా హీరోలను తీసుకుందామని చిత్ర బృందం సూచనలు చేసినప్పటికీ చిరంజీవి రిజెక్ట్ చేశారట. దీంతో భోళా శంకర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం అందుతుంది. మరో యంగ్ హీరో దొరికే వరకు, ఈ భోళా శంకర్ షూటింగ్ కు బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు