Ramarao on Duty : టైటిల్ సాంగ్ కు ముహూర్తం ఫిక్స్

టాలీవుడ్ మాస్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రవితేజ సినిమాల లిస్టులోని ” రామారావు అండ్ డ్యూటీ ” విడుదలకు రెడీగా ఉంది. ” రామారావు అండ్ డ్యూటీ ” సినిమాను ఎస్ ఎల్ వి సినిమాస్, ఆర్టీ సినిమా వర్క్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తోనే శరత్ మండవ దర్శకుడిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమవుతున్నాడు.

ఇక సినిమాలో రవితేజ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఓ సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్ అవినీతి రాజకీయ నాయకుల భరతం ఎలా పట్టాడనేదే కాన్సెప్ట్. ఇందులో రజిష విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటిస్తునారు. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అన్ని అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. తాజాగా మరో అప్డేట్ వదిలింది చిత్రం బృందం.

“రామారావు అండ్ డ్యూటీ ” టైటిల్ సాంగ్ కు ముహూర్తం ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ మేరకు రవి తేజ స్టయిలిష్ గా నిలుచున్న పోస్టర్ వదిలారు. “కింగ్ ఆఫ్ ద క్రౌడ్ ” లిరిక్స్ తో ప్రారంభం అయ్యే ఈ టైటిల్ సాంగ్ ను జూలై 22 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. తేదీ ప్రకటించినప్పటికీ రిలీజ్ టైం మాత్రం చెప్పలేదు. ఇక ఈ పాటను లవిత లోబో పాడగా, శరత్ సంగీత స్వరాలు అందించారు. కాగా ” రామారావు అండ్ డ్యూటీ ” సినిమా జూలై 29వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు