Leo Title Controversy: ఎంత కంగారు పడిపోయార్రా జనం పాపం..!

విజయ్ తలపతి, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రూపొందిన లియో సినిమా అక్టోబర్ 19న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో ఈ సినిమా టైటిల్ విషయంలో వివాదం నెలకొంది. తెలుగులో ఈ టైటిల్ ని ఇంతకు ముందే రిజిస్టర్ చేయించిన వ్యక్తి కోర్టుని ఆశ్రయించగా రిలీజ్ ని వాయిదా వేస్తూ కోర్ట్ తీర్పు ఇచ్చిందని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

ఈ నేపథ్యంలో స్పందించిన ప్రొడ్యూసర్ నాగవంశీ సదరు పిటిషనర్ తో సంప్రదింపులు జరిపి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఎట్టకేలకు 25లక్షలు ఇచ్చి అతన్ని కాంప్రమైజ్ చేశారని సమాచారం అందుతోంది. దీంతో లియో సినిమా రిలీజ్ పై నెలకొన్న అనుమానాలు క్లియర్ అయ్యాయి.

సినిమా రిలీజ్ వాయిదా వేస్తూ కోర్ట్ జడ్జిమెంట్ ఇచ్చిందంటూ వార్తలు వచ్చినప్పటికీ ఏ మాత్రం కాన్ఫిడెన్స్ కోల్పోకుండా సినిమా కచ్చితంగా అనౌన్స్ చేసిన డేట్ కే రిలీజ్ అవుతుందంటూ ప్రెస్  మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చాడు ప్రొడ్యూసర్ నాగవంశీ. చెప్పినట్టుగానే కొన్ని గంటల్లోనే ఇష్యూని క్లియర్ చేయటంతో వంశీ మామూలోడు కాదంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. 25లక్షలకే కాంప్రమైజ్ అయ్యే వాడు కోర్ట్ వరకూ వెళ్లి హడావిడి చేయటం ఏంటని ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ సినిమా మీద కోలీవుడ్లో మాత్రమే కాకుండా పాన్ ఇండియా వైడ్ అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. ఇటీవలే రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. విజయ్ గత చిత్రం వారసుడు తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచినప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడని నేపథ్యంలో లియో హిట్ అవ్వటం కీలకంగా మారింది. మరి, డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగులో స్ట్రైట్ సినిమాల రేంజ్ లో బిజినెస్ చేసిన లియో సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు