Kalyan Ram : లేడీ విలన్ ఖాయమే ?

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా, వశిష్ట్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘బింబిసార’. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఆగస్టు 5న గ్రాండ్ గా రిలీజ్ అయింది. విడుదలైన తొలి షో నుంచే ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ సరికొత్త లుక్ లో కనిపించాడు. బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. టైం ట్రావెలర్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో బింబిసార అనే రాజు పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించాడు.

తక్కువ థియేటర్స్ లోనే డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అలాగే ఓవరాల్ గా మంచి లాభాలను కూడా తెచ్చుకుంటుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు అందరి దృష్టి బింబిసార 2 పై పడింది. దీన్ని 2023 ఆగస్టులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బింబిసార ఫస్ట్ పార్ట్ లో బింబిసార ఐదవ శతాబ్దం నుంచి 2022 లోకి వచ్చాడు. కానీ బింబిసార 2లో మాత్రం బింబిసార ముందుకు వెనక్కి ఊగిసలాడతాడని టాక్. అంటే కొంచెం భూతకాలం, మరికొంత వర్తమాన కాలంలో కథ నడుస్తుందని తెలుస్తోంది.

రెండో భాగం సీక్వెల్ కాకుండా, ప్రీక్వేల్ గా వస్తుందని సమాచారం అందుతోంది. అలాగే బింబిసార 2 లో కొత్త పాత్రలు రాబోతున్నాయని డైరెక్టర్ వశిష్ట్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ఓ లేడీ విలన్ కూడా ఉందని తెలుస్తోంది. కథలో ఓ రాక్షసి పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. ఆ పాత్రలో పేరున్న హీరోయిన్ ను ఎంపిక చేయడానికి మేకర్స్ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ లేడీ విలన్ లను చూసి చాలా కాలం అవుతుంది. అందుకే ఆ పాత్రలో పేరున్న కథానాయక నటిస్తే తెరపై చూడ్డానికి బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. పైగా బింబిసార హిట్ కావడంతో చాలా మంది హీరోయిన్లు నటించడానికి ముందుకొస్తున్నారు. మరి ఆ లేడీ విలన్ పాత్ర ఎవరు చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు