Devara: భారీగా ప్లాన్ చేస్తున్న కొరటాల – ఫ్యాన్స్ కి పూనకాలే..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఆచార్య సినిమాతో డిజాస్టర్ అందుకున్న కొరటాల ఈ సినిమా ద్వారా ఎలా అయినా హిట్ అందుకొని తన సత్తా చాటాలన్న కసితో ఉన్నాడు. RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కాబట్టి దేవర కోసం అభిమానులతో సహా నార్మల్ ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

గత కొంత కాలంగా ఈ సినిమాలో అండర్ వాటర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని, అది సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని టాక్ వినిపిస్తోంది. హైదరాబద్ లో షూటింగ్ ప్లాన్ చేసిన ఈ సీక్వెన్స్ గురించి మరొక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం ఘాజి సినిమాలో వాడిన అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాడుతున్నారని అంటున్నారు. అంతే కాకుండా ఈ సినిమా జాలరి పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ జాలరి యాసలో చెప్పే మాస్ డైలాగ్స్ మాస్ ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని అంటున్నారు. ముఖ్యంగా అండర్ వాటర్ సీక్వెన్స్ లో విఎఫెక్స్ సినిమాకే హైలైట్ అవుతాయని అంటున్నారు.

ఇప్పటిదాకా కొరటాల తీసిన సినిమాల్లో లేని విధంగా వాయిలెన్స్ హాయ్ డోస్ లో ఉంటుందని అంటున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ఈ సినిమా హిట్ అవ్వటం అటు కొరటాల, ఇటు ఎన్టీఆర్ కి కీలకం అని చెప్పాలి. టైటిల్ పోస్టర్ ద్వారా ఈ సినిమాలో వాయిలెన్స్ పీక్ లెవెల్లో ఉండనుందని సంకేతం ఇచ్చిన కొరటాల దేవర సినిమాతో కమ్ బ్యాక్ ఇస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు