Prabhas: ‘ప్రాజెక్ట్ కె’ లో కమల్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్ గ్యారెంటీ..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె సినిమా గురించి తరచూ ఏదో ఒక అప్డేట్ వినపడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా బిగ్ బి అమితాబ్ ఒక ఇంపార్టెంట్ రోల్ నటించనున్నాడు. తాజాగా కమల్ హాసన్ ఇందులో విలన్ రోల్ లో నటిస్తున్నాడన్న అప్డేట్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ప్రాజెక్ట్ కె లో కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అమితాబ్, కమల్ పాత్రలతోనే ప్రాజెక్ట్ కె స్క్రీన్ ప్లే ఉంటుందని అంటున్నారు.

కొత్తగా కనుగొన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని తన స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకోవాలని భావించే విలన్ క్యారెక్టర్లో కమల్ కనిపిస్తాడట. ఆ టెక్నాలజీని మంచి కోసం ఉపయోగించాలని భావించే పాజిటివ్ క్యారెక్టర్లో అమితాబ్ కనిపిస్తాడని అంటున్నారు. కమల్ ని ఎదుర్కొనే వెపన్స్ లాగా ప్రభాస్, దీపికల క్యారెక్టర్లు ఉండనున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది.

కమల్ హాసన్ క్యారెక్టర్ ని నాగ్ అశ్విన్ ఇంత వరకూ చూడని విధంగా చాలా క్రూయల్ గా డిజైన్ చేసాడని సమాచారం. వినిపిస్తున్న టాక్ ఎంతవరకు నిజమో తెలీదు కానీ, సినిమా మాత్రం చాలా హైప్ క్రియేట్ చేస్తోంది. ఇదిలా ఉండగా, 2024 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లైట్ అయ్యిందని, అనుకున్న సమయానికి రిలీజ్ చేసి తీరాలన్న కసితో సినిమా యూనిట్ పని చేస్తోందని సమాచారం. మరి, వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న ప్రభాస్ కి ప్రాజెక్ట్ కె పాన్ వరల్డ్ హిట్ ఇస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు