Lavanya tripathi : పండగ రోజు మెగాకోడలి కష్టాలు…

టాలీవుడ్ లో మెగా ఫ్యామిలి కి ఉండే ఫాలోయింగే వేరు. ఎక్కువ సక్సెస్ ఫుల్ హీరోలున్న ఈ ఫ్యామిలీ ఏ పండగైనా, పబ్బం అయినా ఒకే చోట సెలెబ్రేట్ చేయడం ఫ్యాన్స్ కే కాదు, తెలుగు సినీ అభిమానులందరికి నచ్చుతుంది. ఇక ఈ ఇయర్ సంక్రాంతి మెగా ఫ్యామిలీ మొత్తం బెంగుళూరుకి వెళ్లి సెలెబ్రేట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ ఏ సెలబ్రేషన్ చేసినా, బెంగుళూర్ లో చిరంజీవి ఫామ్ హౌస్ లో జరపడం చూస్తూనే ఉంటాం. అలాగే ఈ ఇయర్ కూడా మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడికి వెళ్లిపోయారు.

ఇక ఈ సంక్రాంతి కి మెగా ఫ్యామిలీ లో కొత్త మెంబెర్ గా కొణెదల లావణ్య త్రిపాఠి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే పండగ సందర్బంగా ఫ్యామిలీతో కలిసి బెంగుళూరు కి విచ్చేసిన కొత్త కోడలు పండగ రోజే కష్టపడాల్సి వచ్చింది.. అవును.. అయితే మీరనుకునేంత విషయమేమి కాదు గాని.. కొత్త కోడలు కొణెదల లావణ్య ఫ్యామిలీ అందరి కోసం సున్నుండలు తయారు చేస్తుంది. స్వీట్లు కూడా చేయడం రాని లావణ్య మెగా ఇంటికి వెళ్లి అక్కడే అన్నీ నేర్చుకుంటుందని అని నెటిజన్లు అంటున్నారు.

అయితే కొణెదల లావణ్య సున్నుండలు చేస్తున్న వీడియో ని ఇంస్టాగ్రామ్ స్టేటస్ ద్వారా మెగా కోడలు ఉపాసన కొణెదల చూపించడం జరిగిం. పక్కనే వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ఇక ఉపాసన స్టేటస్ లు చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా గేమ్ ఛేంజర్ కి బ్రేక్ ఇచ్చి సెట్స్ నుండి డైరెక్ట్ గా బెంగుళూర్ కి చేరుకొని ఫ్యామిలీ తో గడుపుతున్నాడు. ఇక రామ్ చరణ్ కూడా దోసెలు వేస్తున్నట్టు ఉపాసన స్టేటస్ పెట్టింది.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు